Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోండా సిటీ కార్.. జీరో డౌన్ పేమెంట్.. ధర రూ.3 లక్షల కన్నా తక్కువే..

CAR: గత కొంత కాలంగా హ్యాచ్‌బ్యాక్ కార్లు భారతీయ ఆటో రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలా కంపెనీలు మంచి హ్యాచ్‌బ్యాక్ కార్లను ప్రారంభించాయి.

హోండా సిటీ కార్.. జీరో డౌన్ పేమెంట్.. ధర రూ.3 లక్షల కన్నా తక్కువే..
Honda Car
Follow us
uppula Raju

|

Updated on: Oct 12, 2021 | 8:40 AM

CAR: గత కొంత కాలంగా హ్యాచ్‌బ్యాక్ కార్లు భారతీయ ఆటో రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలా కంపెనీలు మంచి హ్యాచ్‌బ్యాక్ కార్లను ప్రారంభించాయి. సెకండ్‌ హ్యాండ్‌ కార్లను ఇష్టపడే వ్యక్తులకు కొదవలేదు. ఇందులో హోండా, హ్యుందాయ్, మారుతి వంటి కంపెనీల కార్లు ఎక్కువగా సేల్‌ అవుతున్నాయి. మీరు కూడా చౌకైన కారు కోసం చూస్తున్నట్లయితే ఈ కారు గురించి తెలుసుకోవాల్సిందే.. వాస్తవానికి అద్బుత పీచర్లో ఉన్న ఈ కారు చాలా మందికి నచ్చింది కానీ దాని ధర ఎక్కువని ఆలోచిస్తున్నారు. హోండా సిటీ కారును రూ.3 లక్షల కంటే తక్కువ ధరలో అంటే రూ .2.78 లక్షలకు విక్రయిస్తున్నారు. అంతేకాదు దీనిని కొనుగోలు చేయాలంటే జీరో డౌన్‌పేమెంట్, సులభమైన వాయిదాల ఎంపిక కూడా కల్పించారు.

ఈ హోండా సిటీ కారు సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే కార్స్ 24 అనే వెబ్‌సైట్‌లో ప్రదర్శించారు. ఈ కారు ఇంజిన్ 1497 సీసీ. ఈ కారు 116 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదనంగా ఇది 42 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది. 5 మంది కూర్చునే సామర్థ్యంతో వస్తున్న ఈ కారు లీటర్‌కి 16.8 కిమీ మైలేజ్ ఇస్తుంది. భద్రత దృష్ట్యా రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ముందు వెనుక భాగంలో పవర్ విండోస్ ఫీచర్ ఉంది. ఇందులో అనేక ఇతర ఫీచర్లు కూడా కల్పించారు.

ఇది క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ కారు మోడల్ 2009. ఇప్పటివరకు ఈ కారు 43,966 కి.మీ. ప్రయాణించింది. దీని రిజిస్ట్రేషన్ ఢిల్లీలోని DL-7C RTO కార్యాలయంలో నమోదై ఉంది. ఈ హోండా సిటీని కొనుగోలు చేసినప్పుడు కంపెనీ కొన్ని షరతులతో పాటు ఆరు నెలల వారంటీ, ఏడు రోజుల డబ్బు తిరిగి ఇచ్చేలా హామీని ఇస్తోంది. ఇది కాకుండా కార్స్ 24 లోన్‌తో జీరో డౌన్ పేమెంట్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.

ఈ కారు మరిన్ని వివరాలు cars 24 వెబ్‌సైట్‌లో ఉన్నాయి. వినియోగదారులు గమనించగలరు. సైట్‌లో ఉన్న వివరాలు మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది.

Provident Fund: గుడ్‌న్యూస్‌.. దీపావళి పండగకు ముందే పీఎఫ్‌ వడ్డీ.. ఏర్పాట్లు చేస్తోన్న ఈపీఎఫ్‌ఓ..!