ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ దేశం.. ప్రధాని మోదీ సమీక్ష.. బాధితులకు సహాయం చేయాలని ఆదేశం

ప్రధానిగా మోదీ ఢిల్లీలో ప్రమాణం చేస్తున్న సమయంలో జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రదాడి జరగడంతో దేశ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కపడింది. ఉగ్రదాడిని ఖండించారు కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, రాహుల్‌. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యాత్రికుల బస్సుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల‌తో అదుపు త‌ప్పిన బ‌స్సు లోయ‌లో ప‌డిపోయింది. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యాత్రికులు బస్సులో వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్నారు.

ఉగ్రదాడితో ఉలిక్కిపడ్డ దేశం.. ప్రధాని మోదీ సమీక్ష.. బాధితులకు సహాయం చేయాలని ఆదేశం
Pm Modi
Follow us

|

Updated on: Jun 10, 2024 | 8:59 AM

ప్రధానిగా మోదీ ఢిల్లీలో ప్రమాణం చేస్తున్న సమయంలో జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రదాడి జరగడంతో దేశ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కపడింది. ఉగ్రదాడిని ఖండించారు కాంగ్రెస్‌ నేతలు ఖర్గే, రాహుల్‌. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యాత్రికుల బస్సుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల‌తో అదుపు త‌ప్పిన బ‌స్సు లోయ‌లో ప‌డిపోయింది. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యాత్రికులు బస్సులో వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్నారు. మార్గం మధ్యలో రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ దుర్ఘటన జరిగింది. రాజౌరీ, పూంఛ్‌, రియాస్‌లలో ఎత్తైన కొండ ప్రాంతాల్లో చెట్ల పొదలమాటున దాక్కొని ఉగ్రవాదులు ఈ తరహా దాడులు చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు.

యాత్రికులపై ఉగ్ర దాడిని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్‌లో ఆందోళనకరంగా ఉన్న భద్రత పరిస్థితుల వాస్తవ రూపాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోందని రాహుల్‌ విమర్శించారు. ఆయనతోపాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మరోవైపు యాత్రికుల దాడి నేపథ్యంలో ఘటనాస్థలంలోని పరిస్థితిపై ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌ ఎల్జీ మనోజ్‌ సిన్హాతో సమీక్ష నిర్వహించారు. అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, బాధితులకు సాయం చేయాలని ఎల్జీని ఆదేశించారు. ఒక‌వైపు న‌రేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ‌ం చేస్తున్న స‌మ‌యంలో దాడి జ‌ర‌గ‌డం, సామాన్య ప్రయాణికుల‌ను ఉగ్రవాదులు టార్గెట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్