Delhi: ప్రధాని మోదీ తొలి కేబినెట్ సమావేశం.. శాఖల కేటాయింపుపై స్పష్టత అప్పుడే..

సంకీర్ణ ధర్మం పాటిస్తూ, మోదీ జంబో కేబినెట్‌ కూర్పు పూర్తయింది. ఇక యాక్షన్‌లోకి దిగే టైమొచ్చింది. అంతకంటే ముందు ఎవరికి ఏయే శాఖలు దక్కుతాయి అన్నది ఆసక్తిగా మారింది. దీనికి సంబందించిన కొంత సమాచారం పార్టీ నేతల నుంచి వెలువడుతోంది. జూన్ 10 సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశం జరగనుంది. మోదీ నేతృత్వంలో సమావేశానికి ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు హాజరుకానున్నారు. మధ్యాహ్నంకల్లా పోర్టుఫోలియోలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు వెల్లడైతే ఎవరికి ఏశాఖ కేటాయించారో స్పష్టం వస్తుంది.

Delhi: ప్రధాని మోదీ తొలి కేబినెట్ సమావేశం.. శాఖల కేటాయింపుపై స్పష్టత అప్పుడే..
Pm Modi
Follow us

|

Updated on: Jun 10, 2024 | 8:18 AM

సంకీర్ణ ధర్మం పాటిస్తూ, మోదీ జంబో కేబినెట్‌ కూర్పు పూర్తయింది. ఇక యాక్షన్‌లోకి దిగే టైమొచ్చింది. అంతకంటే ముందు ఎవరికి ఏయే శాఖలు దక్కుతాయి అన్నది ఆసక్తిగా మారింది. దీనికి సంబందించిన కొంత సమాచారం పార్టీ నేతల నుంచి వెలువడుతోంది. జూన్ 10 సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్‌ తొలి సమావేశం జరగనుంది. మోదీ నేతృత్వంలో సమావేశానికి ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు హాజరుకానున్నారు. మధ్యాహ్నంకల్లా పోర్టుఫోలియోలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు వెల్లడైతే ఎవరికి ఏశాఖ కేటాయించారో స్పష్టం వస్తుంది. మోదీ టీమ్‌లో 30 మందికి కేబినెట్‌ ర్యాంక్‌ దక్కనున్నట్లు సమాచారం. ఐదుగురికి స్వతంత్ర హోదా, 36 మందికి సహాయమంత్రులుగా అవకాశం కల్పించనున్నారు. కర్తవ్య నిర్వహణపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. 100రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సంస్థాగత మార్పులపైనా త్వరలో మోదీ ఫోకస్‌ పెట్టనున్నారు.

కేబినెట్‌లో బీజేపీకి 61 మంత్రి పదవులు దక్కాయి. ఇక మిత్రపక్షాలకు 11 మంత్రిపదవులు కేటాయించారు. అంటే మిత్రపక్షాలకు 15 శాతం మంత్రిపదవులు దక్కాయి. టీడీపీకి రెండు, జేడీయూ 2, ఎల్‌జేపీ-1, జేడీఎస్‌-1, శివసేన-1, ఆర్‌పీఐ-1, ఆర్‌ఎల్డీ-1, ఏడీఎస్‌-1, హెచ్‌ఏఎం-1 పార్టీలకు మంత్రిపదవులు దక్కాయి. ఇందులో రెండోసారి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారు 36 మంది ఉండగా, కొత్త మంత్రులు కూడా 36 మంది ఉన్నారు. 43 మందికి మూడుసార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం, 23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మోదీ గత రెండు కేబినెట్‌లతో పోల్చితే సంఖ్యాపరంగా ఈ కేబినెట్‌ సైజు పెద్దది. అంటే మొత్తం 72 మంది ఈ మంత్రిమండలిలో ఉన్నారు. కేబినెట్‌ సైజు పెరిగినా, సంకీర్ణ ధర్మం ప్రకారం మిత్రపక్షాలకు మంత్రిపదవులు కట్టబెట్టినా, కీలక శాఖలు మాత్రం బీజేపీ తన దగ్గరే ఉంచుకుంటుందని భావిస్తున్నారు. ఇక హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి అనుగుణంగా మోదీ సోషల్‌ ఇంజినీరింగ్‌పై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అలాగే NCP అజిత్‌ పవార్‌ మంత్రిపదవి తీసుకోకపోవడం ఆసక్తిగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్