AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశా సీఎం ఎవరన్నదానిపై ఉత్కంఠ.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపరిణామం..

సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్‌ కీలక నేత వీకే పాండియన్‌ రాజకీయాలకు గుడ్‌ బై చెప్పడం ఆసక్తిగా మారింది. అటు.. ఒడిశా సీఎం ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ఒడిశా రాజకీయాల్లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఒడిశాలో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎంపీ సీట్లను సైతం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.

ఒడిశా సీఎం ఎవరన్నదానిపై ఉత్కంఠ.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపరిణామం..
V.k Pandian
Srikar T
|

Updated on: Jun 10, 2024 | 6:44 AM

Share

సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులు సృష్టిస్తున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్‌ కీలక నేత వీకే పాండియన్‌ రాజకీయాలకు గుడ్‌ బై చెప్పడం ఆసక్తిగా మారింది. అటు.. ఒడిశా సీఎం ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ఒడిశా రాజకీయాల్లో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఒడిశాలో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎంపీ సీట్లను సైతం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే.. బీజేపీ ఘనవిజయం.. బిజూ జనతా దళ్‌ దారుణ ఓటమితో ఒడిశా పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితుడైన తమిళనాడుకు చెందిన మాజీ ఐఏఎస్‌ వీకే పాండియన్ టార్గెట్‌గానే రాజకీయాలు కొనసాగాయి. బీజేడీలో పాండియన్ కీలకంగా వ్యవహరించడంతో ఒడిశా అధికారం తమిళ వ్యక్తి చేతుల్లోకి వెళ్లిందంటూ బీజేపీ పెద్దయెత్తున విమర్శలు ఎక్కుపెట్టింది.

ఈ క్రమంలోనే.. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు పాండియన్‌ సంచలన ప్రకటన చేశారు. సోషల్​ మీడియాలో వీడియో షేర్ చేసిన ఆయన.. ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. తనపై వ్యతిరేకంగా జరిగిన ప్రచారమే పార్టీ ఓటమికి కారణమైతే మన్నించాలని బీజేడీ కార్యకర్తల్ని వేడుకున్నారు. అటు.. పాండియన్‌ తన వారసుడు కాదని.. ప్రజలే వారసుడిని నిర్ణయిస్తారని బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ చెప్పిన మరుసటి రోజే ఆయన పాలిటిక్స్‌ గుడ్‌ బై చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు.. ఒడిశా కొత్త సీఎం ఎవరనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో పాటు.. బీజేపీ సీనియర్‌ నేతలు, సంబిత్‌ పాత్ర, అపరాజిత సారంగి, ప్రతాప్ సారంగి, గిరీశ్ చంద్ర పేర్లు ముఖ్యమంత్రి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే.. ధర్మేంద్ర ప్రధాన్‌ మరోసారి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఒడిశా సీఎం ఎవరనేది మరింత ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..