- Telugu News Photo Gallery Political photos PM Swearing in Ceremony: Indelible signature, PM Narendra Modi's photo is going viral
PM Modi: చెరగని సంతకంతో చరిత్రను తిరగరాస్తున్నారు.. నెట్టింట వైరల్ అవుతున్న ప్రధాని మోదీ ఫొటో..
ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ మోడోసారి ప్రమాణం చేసిన అనంతరం సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.. మోదీ తన సంతకంతో చరిత్రను తిరగరాస్తున్నారు.. చరిత్రలో తన పేరు రాసుకుంటున్నారు.. అంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తూ.. ఫొటోను షేర్ చేస్తున్నారు.
Updated on: Jun 09, 2024 | 9:38 PM

భారతదేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది.

72 మందితో మోదీ కేబినెట్ సిద్ధం అయింది. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా..-ఐదుగురు సహాయ మంత్రులు ,36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. మోదీ కేబినెట్‌లో 27 మంది ఓబీసీలు, ఎస్సీ-10, ఎస్టీ-5, మైనార్టీలు-ఐదుగురు ఉన్నారు. మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు ఇచ్చారు. 43 మందికి మూడుసార్లు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండగా..23 మందికి రాష్ట్రాల్లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.

కాగా.. ప్రధానిగా నరేంద్రమోదీ మోడోసారి ప్రమాణం చేసిన అనంతరం సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.. మోదీ తన సంతకంతో చరిత్రను తిరగరాస్తున్నారు.. చరిత్రలో తన పేరు రాసుకుంటున్నారు.. అంటూ.. నెటిజన్లు కామెంట్లు చేస్తూ.. ఫొటోను షేర్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేబినెట్‌లో చోటు దక్కింది. శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన రామ్మోహన్‌నాయుడు కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణం చేశారు. నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మ...కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు.

సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు.

ఈ వేడుకకు TDP అధినేత, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సహా మిత్రపక్షాల అగ్రనేతలంతా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారమహోత్సవానికి పలు దేశాల అధినేతలు, సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది.





























