AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. ఫస్ట్ డే నే ఎంపీ మహువాపై చర్చించే అవకాశం

ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజునే అంటే ఈ రోజే క్యాష్ ఫర్ క్వెరీ' కేసులో TMC ఎంపీ మహువా మొయిత్రాకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ తన నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికలో మహువాను సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ నివేదికను లోక్‌సభ ఆమోదిస్తే మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వం ముగుస్తుంది.

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. ఫస్ట్ డే నే ఎంపీ మహువాపై చర్చించే అవకాశం
Parliament Winter Session
Surya Kala
|

Updated on: Dec 04, 2023 | 7:56 AM

Share

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నేటి నుంచి (డిసెంబర్ 4 ) ప్రారంభమై డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు ఈ సెషన్ జరగనుండగా.. ఈ సెషన్‌లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజునే అంటే ఈ రోజే క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో TMC ఎంపీ మహువా మొయిత్రాకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ తన నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికలో మహువాను సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.

ఈ నివేదికను లోక్‌సభ ఆమోదిస్తే మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వం ముగుస్తుంది. అంతే కాకుండా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనేక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుతో సహా 7 కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు IPC, CRPC , క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ , ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ప్రతిపాదిత చట్టాలను కూడా ఈ సమావేశాలలో సమ్పర్పించనున్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఇండియన్ జస్టిస్ కోడ్ బిల్లు-2023, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ బిల్లు-2023 , ఇండియన్ ఎవిడెన్స్ బిల్లు-2023తో సహా వివిధ బిల్లులపై  చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అయితే నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మూడు రాష్ట్రాల్లో ఘోర పరాజయంతో నిరాశ చెందిన విపక్షాలు ఏకమై బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ బీజేపీ కూడా ప్రతిపక్ష నేతలను ధీటుగా ఎదుర్కొంటుందని.. తగిన విధంగా సమాధానం  చెబుతుందని అంటున్నారు. ఏది ఏదైనా ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరగవచ్చునని.. ఈ సెషన్ గందరగోళంగా మారవచ్చని అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..