Elections: ఏడు పర్యాయాలుగా ఓటేసేందుకు దూరంగా ఉన్న గ్రామస్థులు.. అసలు కారణం ఇదే..
ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకు కల్పించిన అతిపెద్ద ఆయుధం. దీనిని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. తమకు ఇష్టమైన పాలకులను తామే స్వయంగా ఎన్నుకోవచ్చు. ఇంతటి గొప్ప అవకాశం మన రాజ్యాంగం మనకు కల్పించింది. దీనిని కొందరు దుర్వినియోగం కూడా చేసుకుంటూ ఉంటారు. బీరు, బిరియానీ పథకం కింద కొందరు తమ ఓటు హక్కును అమ్ముకుంటూ ఉంటారు. ప్రస్తుతం మన దేశంలో నాయకుల తలరాతలను మార్చే శక్తి యువతకు ఉంది.
ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకు కల్పించిన అతిపెద్ద ఆయుధం. దీనిని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. తమకు ఇష్టమైన పాలకులను తామే స్వయంగా ఎన్నుకోవచ్చు. ఇంతటి గొప్ప అవకాశం మన రాజ్యాంగం మనకు కల్పించింది. దీనిని కొందరు దుర్వినియోగం కూడా చేసుకుంటూ ఉంటారు. బీరు, బిరియానీ పథకం కింద కొందరు తమ ఓటు హక్కును అమ్ముకుంటూ ఉంటారు. ప్రస్తుతం మన దేశంలో నాయకుల తలరాతలను మార్చే శక్తి యువతకు ఉంది. అయితే తాజాగా సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. అదే ఓటు హక్కును వినియోగించకుండా బహిష్కరించడం. కేవలం ఒకరిద్దరు కాదు.. ఒక గ్రామం మొత్తం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనికి గల కారణాలను ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా పోలింగ్ కేంద్రాల వద్దకు నాయకులు ఓటర్ల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మినీ వ్యాన్, ఆటో లాంటివి అందుబాటులో ఉంచుతారు. దీనికి కారణం పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు తెలియకపోవడం, చాలా దూరం ప్రయాణించి వ్యయప్రయాసలకు గురి కాకుండా ఉండటం కోసం ఈ రకమైన సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుతారు. అయితే ఇక్కడ ఇలాంటి పప్పులేవీ ఉడకవు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తమ దారి తమదే. తమ పంతం వీడటం లేదు. రాజస్థాన్‌లో ఈ రోజు సాయంత్రం 5 గంట వరకూ పోలింగ్ కోనసాగింది. మొత్తం 200 స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 68శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే జైపూర్ జిల్లాలోని పాలావాలా జతన్ గ్రామస్థులు తమ ఓటు వేసేందుకు నిరాకరించారు. ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
తమ గ్రామానికి సమీపంలో ఉన్న తూంగా గ్రామానికి రోడ్డు వేయాలని పాలావాలా జతన్ గ్రామస్థులు ప్రభుత్వాలకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు పాలకులు, అధికారులు. దీంతో ఆగ్రహానికి లోనైన ఈ గ్రామస్తులు ఎన్నికల వేళ పోలింగ్‌ను బహిష్కరించారు. అధికారులు ఈవీఎం మిషన్లతో అనేక ఏర్పాట్లు చేసినప్పటికీ ఒక్క ఓటరు కూడా ఓటు వేసేందుకు ముందుకు రాలేదు. దశాబ్దాల కాలంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జరిగిన ఎలక్షన్‌తో కలిపి ఏడు సార్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించలేదంటున్నారు గ్రామస్తులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..