Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: చాలా గర్వంగా ఉంది.. తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఫొటోలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేజస్ విమానంలో ప్రయాణించారు. కర్ణాటకలోని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తేజస్ విమానంలో ప్రయాణించి.. అనుభవం గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో షేర్ చేశారు.

PM Modi: చాలా గర్వంగా ఉంది.. తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఫొటోలు
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 25, 2023 | 1:26 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేజస్ విమానంలో ప్రయాణించారు. కర్ణాటకలోని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తేజస్ విమానంలో ప్రయాణించి.. అనుభవం గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో షేర్ చేశారు. “ తేజస్‌లో విజయవంతంగా ప్రయాణాన్ని పూర్తి చేశాను.. ఈ అనుభవం అద్భుతంగా ఉంది.. మన కృషి, అంకితభావం కారణంగా, స్వయంశక్తి రంగంలో మనం ప్రపంచంలో ఎవరికీ తక్కువ కాదని నేను చాలా గర్వంగా చెప్పగలను. మన దేశ స్వదేశీ సామర్థ్యాలపై నా విశ్వాసాన్ని గణనీయంగా పెంచింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, DRDO, HAL అలాగే భారతీయులందరికీ హృదయపూర్వక అభినందనలు’’.. అంటూ ప్రధాని మోదీ కొన్ని చిత్రాలను పంచుకున్నారు.

మన రక్షణ వ్యవస్థను పటిష్టపరిచేందుకు మోదీ ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. రక్షణ వ్యవస్థ సంసిద్ధతను పెంచడం, తేజస్ విమానాలు కూడా స్వదేశీగా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది. తేజాస్ విమానం మొదటి వెర్షన్ 2016లో IAFలోకి ప్రవేశించింది. ప్రస్తుతం, IAF రెండు స్క్వాడ్రన్‌లు, 45 స్క్వాడ్రన్, 18 స్క్వాడ్రన్, LCA తేజాస్‌తో పూర్తిగా పనిచేస్తున్నాయి.

ప్రధాని మోదీ ఫొటోలు చూడండి..

మోడీ ప్రభుత్వ హయాంలో, 83 LCA Mk 1A విమానాల డెలివరీ కోసం రూ. 36,468 కోట్ల విలువైన ఒప్పందం HALతో కుదిరింది. డెలివరీ ఫిబ్రవరి 2024 నాటికి ప్రారంభమవుతుంది. LCA తేజస్ నవీకరణ కోసం ఎన్నో మార్పులు చేశారు. LCA Mk 2 అభివృద్ధి కోసం రూ.9000 కోట్ల కంటే ఎక్కువ నిధులు మంజూరు చేశారు.

ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్‌తో సహా స్వదేశీ ఉత్పత్తులను మరింత ప్రోత్సహించడానికి జూన్ 2023లో ప్రధానమంత్రి US పర్యటన సందర్భంగా GEతో భారతదేశంలో GE ఇంజిన్ తయారీకి సాంకేతికతను బదిలీ చేయడం గురించి చర్చలు జరిగాయి.

DRDO చీఫ్ డాక్టర్ సమీర్ వి కామత్ శనివారం మాట్లాడుతూ, “భారత రక్షణ రంగానికి గణనీయమైన ప్రోత్సాహం కోసం, LCA మార్క్ 2, స్వదేశీ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) మొదటి రెండు స్క్వాడ్రన్‌లు దేశీయంగా ఉత్పత్తి చేయబడతాయని తెలిపారు. “LCA మార్క్ 2 ఇంజిన్‌లు, స్వదేశీ అధునాతన మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లోని మొదటి రెండు స్క్వాడ్రన్‌లు US నుంచి అన్ని అనుమతులు పొందినందున అమెరికన్ GE మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో కలిసి దేశంలోనే ఉత్పత్తి చేయబడతాయి” అని DRDO చీఫ్ డాక్టర్ సమీర్ వి. కామత్ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..