Pranshu: ఇన్ స్టా రీల్స్‏లో బ్యాడ్ కామెంట్స్.. తట్టుకోలేక మేకప్ ఆర్టిస్ట్ ఆత్మహత్య..

డాన్స్, కుకింగ్ వీడియోస్ చేసి ఫేమస్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాగే దాని కారణంగానే డిప్రెషన్‏లోకి వెళ్లి జీవితాలను నాశనం చేసుకున్న వారు ఉన్నారు. ప్రపంచంలోని కోట్లాది మంది నెట్టింట కనిపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటాయి. కొందరు ఏం చేసినా లైక్స్ కొట్టేస్తూ వాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. మరికొందరిని మాత్రం టార్గెట్ చేసి అసభ్యంగా కామెంట్స్ చేస్తుంటారు. దీంతో మానసిక ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నవారు ఉన్నారు.

Pranshu: ఇన్ స్టా రీల్స్‏లో బ్యాడ్ కామెంట్స్.. తట్టుకోలేక మేకప్ ఆర్టిస్ట్ ఆత్మహత్య..
Prashnu
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 25, 2023 | 4:13 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో గంటలు గంటలు మునిగిపోతున్నారు ప్రజలు. ఫాలోయింగ్, ఫేమ్ కొందరు ఆరాటపడుతుంటే.. తమ వ్యాపార సంస్థలను ప్రమోట్ చేసుకోవడానికి నెట్టింటిని వారధిగా ఉపయోగిస్తున్నారు. అయితే కొందరికి సోషల్ మీడియా మంచి గుర్తింపును తీసుకువస్తుంది. ఇప్పుడు డాన్స్, కుకింగ్ వీడియోస్ చేసి ఫేమస్ అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాగే దాని కారణంగానే డిప్రెషన్‏లోకి వెళ్లి జీవితాలను నాశనం చేసుకున్న వారు ఉన్నారు. ప్రపంచంలోని కోట్లాది మంది నెట్టింట కనిపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కో విధంగా ఉంటాయి. కొందరు ఏం చేసినా లైక్స్ కొట్టేస్తూ వాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. మరికొందరిని మాత్రం టార్గెట్ చేసి అసభ్యంగా కామెంట్స్ చేస్తుంటారు. దీంతో మానసిక ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నవారు ఉన్నారు. తాజాగా ఇన్ స్టా రీల్స్ లో కామెంట్స్ తట్టుకోలేక ఓ మేకప్ ఆర్టిస్ట్ సూసైడ్ చేసుకున్నాడు.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జెయినికి చెందిన 16 ఏళ్ల ట్రాన్స్ జెండర్ ప్రన్షు మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడు. తన ఇన్ స్టా ఖాతాలో చురుగ్గా ఉంటూ రకరకాల మేకప్ వీడియోస్ షేర్ చేస్తుంటాడు. అయితే ఈ మధ్య దీపావళి పండగ సమయంలో ప్రష్ను చీర కట్టుకున్న వీడియోను షేర్ చేశాడు. అయితే ఆ వీడియోకు దాదాపు 4000 పైగా బ్యాడ్ కామెంట్స్ రావడంతో తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. దీంతో ఇటీవల అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయన్ని ట్రాన్స్ జెండర్.. మేడ్ ఇన్ హెవెన్ వెబ్ సిరీస్ యాక్టర్ త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మేకప్ లో తనకు ఎన్నో మెళకువలు నేర్పానని.. ట్రాన్స్ జెండర్స్ కు సోషల్ మీడియాలో రక్షణ లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ బెదిరింపులను పరిష్కరించడంలో సోషల్ మీడియాలోని కొన్ని యాప్స్ ఫెయిల్ అయ్యాయని అన్నారు. అయితే ప్రన్షు ఆత్మహత్యపై విచారణ జరుగుతుందని అన్నారు నాజ్ గిరి పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి గెహ్లాట్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.