మత్తుకు బానిసైన దంపతులు.. డ్రగ్స్ కొనేందుకు డబ్బులేక ఇద్దరు పిల్లలను అమ్మేసిన దారుణం..

తన బిడ్డను విక్రయించిన నిందితురాలు షబ్బీర్ అక్క రుబీనాఖాన్‌కు ఈ షాకింగ్ వాస్తవం తెలిసింది. దీంతో ఆగ్రహించిన రుబీనా వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలియజేసి ఫిర్యాదు చేసింది. రుబీనా ఫిర్యాదును పోలీసులు క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పుడు షబ్బీర్ ఖాన్, అతని భార్య సైనా ఖాన్, ఉషా రాథోడ్, షకీల్ మక్రానీలపై కేసు నమోదు చేశారు. షబ్బీర్, సైనా డ్రగ్స్ బానిసలని పోలీసులు తెలిపారు.

మత్తుకు బానిసైన దంపతులు.. డ్రగ్స్ కొనేందుకు డబ్బులేక ఇద్దరు పిల్లలను అమ్మేసిన దారుణం..
Couple Sold Children
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 25, 2023 | 5:02 PM

డ్రగ్స్‌కు బానిసలైన ఓ దంపతులు తమ ఇద్దరు పిల్లలను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం భార్యాభర్తల కుటుంబీకులకు తెలియడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులైన దంపతులు మగబిడ్డను రూ.60 వేలకు, నెల వయసున్న ఆడబిడ్డను రూ.14 వేలకు విక్రయించినట్లుగా తెలియటంతో కుటుంబీకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కొనేందుకు తమ పిల్లలను అమ్ముతున్న దంపతులతో సహా మరో ముగ్గురిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక నెల పసికందును రక్షించగా, రెండేళ్ల బాలుడి కోసం గాలిస్తున్నారు. ఈ హృదయ విదారక సంఘటన ఎందరికో కలల నగరంగా పిలిచే ముంబైలో చోటుచేసుకుంది. ముంబై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

దంపతులు డ్రగ్స్‌కు బానిసలయ్యారు. డ్రగ్స్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ముంబైలోని అంధేరీలో తన ఇద్దరు పిల్లలను అమ్మేశారు. ఈ దంపతుల కుటుంబ సభ్యులు పిల్లలను విక్రయిస్తున్న విషయం తెలుసుకుని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో దంపతులు ఇచ్చిన సమాచారం మేరకు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మహిళా ఏజెంట్లలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులైన దంపతులు తమ రెండేళ్ల కొడుకును రూ.60 వేలకు అమ్మేశారు. 9 నెలల ఆడబిడ్డను రూ.14,000కు విక్రయించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారి దయా నాయక్ తెలిపారు.

మత్తు, మందు, డ్రగ్స్‌ లేకుండా బతకలేని పరిస్థితిలో ఈ దంపతులు ఉన్నారు. ఆ మేరకు అడిక్ట్ అయ్యాడు. ఈ సమయంలో ఏజెంట్ ఉషా రాథోడ్ ఈ జంటతో పరిచయం ఏర్పడింది. ఆ దంపతుల మగబిడ్డను 60 వేల రూపాయలకు అమ్మేసింది. అనంతరం 9 నెలల పసికందును 14 వేల రూపాయలకు విక్రయించింది. వీరిలో ఆడపిల్లను కొనుగోలు చేసిన షకీల్ మక్రానీని గుర్తించి అరెస్ట్ చేశారు. బిడ్డ రక్షించబడ్డాడు. అయితే మగబిడ్డను ఎవరు కొనుగోలు చేశారన్నది ఇంకా తెలియరాలేదు. దీంతో మగబిడ్డను కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకుని, పాపను రక్షించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

తన బిడ్డను విక్రయించిన నిందితురాలు షబ్బీర్ అక్క రుబీనాఖాన్‌కు ఈ షాకింగ్ వాస్తవం తెలిసింది. దీంతో ఆగ్రహించిన రుబీనా వెంటనే పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలియజేసి ఫిర్యాదు చేసింది. రుబీనా ఫిర్యాదును ముంబైలోని డి. ఎన్. నగర పోలీసులు క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పుడు షబ్బీర్ ఖాన్, అతని భార్య సైనా ఖాన్, ఉషా రాథోడ్, షకీల్ మక్రానీలపై కేసు నమోదు చేశారు. షబ్బీర్, సైనా డ్రగ్స్ బానిసలని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..