బర్త్ డే గిఫ్ట్‌గా దుబాయ్ కు తీసుకెళ్ళమన్న భార్య.. నో చెప్పిన భర్త.. మహా ఇల్లాలు ఏం చేసిందంటే
రేణుక పుట్టినరోజు సెప్టెంబర్ 18. ఆ రోజు దుబాయ్ వెళ్లి అక్కడ పుట్టినరోజు జరుపుకోవాలని భావించింది. కానీ భర్త తన కోరిక తీర్చకపోవడంతో మనస్తాపం చెందింది. ఆ తర్వాత నవంబర్ 5న వీరి పెళ్లిరోజు. కనీసం ఆ రోజైన తన భర్త నుంచి ఖరీదైన బహుమతి వస్తుందని ఊహించింది. అది కూడా ఫేయిల్ అయ్యింది. రేణుక తన బంధువుల్లో ఒకరి పుట్టినరోజు వేడుకల కోసం ఢిల్లీ వెళ్లాలనుకుంది..కానీ, తన భర్త నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా తను ఏది కోరకున్నా భర్త ఇవ్వకపోవటంతో..

పుట్టిన రోజున తమ భార్యకు ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని, ఆమెను ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్లాలని కొంతమంది భర్తలు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అలాగే, తన పుట్టినరోజు ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే మహిళలు, తన భర్త నుండి సర్‌ప్రైజ్ ఉండాలని ఆశిస్తారు. మరికొందరు అడిగినవి ఇవ్వకపోతే ఇంటి నుండి వెళ్లిపోతారు. ఇలా రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు చాలా మంది దంపతులు. అయితే మహారాష్ట్రలోని పూణెలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. తన పుట్టిన రోజు వేడుకలు దుబాయ్‌లో గ్రాండ్‌గా నిర్వహించాలని కోరుకున్న ఓ భార్య తన భర్త అందుకు నిరాకరించటంతో.. అతని ముక్కుపై ఒక్క పంచ్ ఇచ్చింది. దాంతో అతడు ఏకంగా ప్రాణాలే వదిలేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
పూణేలోని వాన్‌వాడి ప్రాంతంలోని ఓ లగ్జరీ హౌసింగ్ సొసైటీ ఫ్లాట్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిఖిల్ ఖన్నా అనే 38 ఏళ్ల వ్యక్తి దురదృష్టవశాత్తు మరణించాడు. అతను కన్‌స్ట్రాక్షన్ బిజినెస్ చేస్తుండేవాడు. రేణుకతో ఆరేళ్ల క్రితం నిఖిల్‌కు వివాహమైంది. అయితే, ఇటీవల రేణుక పుట్టినరోజు సందర్భంగా ఆమె తన భర్త నుంచి ఎన్నో ఆశించింది. బర్త్‌డే వేడుకల కోసం తనను దుబాయ్‌కు తీసుకెళ్లాలంటూ పట్టుబట్టింది. అందుకు నిఖిల్ నిరాకరించాడు. దాంతో రేణుక తీవ్ర నిరాశకు లోనైంది. మనస్తాపంతో అతనితో వాగ్వాదానికి దిగింది. అంతేకాదు.. ఆమె పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఖరీదైన బహుమతులు కూడా ఇవ్వలేదని.. వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.. అని వాన్‌వాడి పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
రేణుక పుట్టినరోజు సెప్టెంబర్ 18. ఆ రోజు దుబాయ్ వెళ్లి అక్కడ పుట్టినరోజు జరుపుకోవాలని భావించింది. కానీ భర్త తన కోరిక తీర్చకపోవడంతో మనస్తాపం చెందింది. ఆ తర్వాత నవంబర్ 5న వీరి పెళ్లిరోజు. కనీసం ఆ రోజైన తన భర్త నుంచి ఖరీదైన బహుమతి వస్తుందని ఊహించింది. అది కూడా ఫేయిల్ అయ్యింది. రేణుక తన బంధువుల్లో ఒకరి పుట్టినరోజు వేడుకల కోసం ఢిల్లీ వెళ్లాలనుకుంది..కానీ, తన భర్త నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇలా తను ఏది కోరకున్నా భర్త ఇవ్వకపోవటంతో చిర్రెత్తిపోయిన రేణుక ఈ శుక్రవారం రోజున అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో రేణుక పిడికిలి బిగించి భర్త ముక్కుపై కొట్టింది. అతని ముక్కు, కొన్ని పళ్ళు విరిగిపోయాయి. దీంతో నిఖిల్‌కు తీవ్ర రక్తస్రావం జరిగి స్పృహతప్పి పడిపోయాడు.
ఇరుగుపొరుగు వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిఖిల్‌ను సాసూన్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నిఖిల్‌ను రేణుక తన పిడికిలితో కొట్టిందా, లేక మరేదైనా వస్తువును ఉపయోగించారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి కచ్చితమైన కారణం తెలియనుంది. పోలీసులు రేణుకను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..