Watch: స్నేకా.. మజాకా..! టీచర్ స్కూటీలో దూరిన కట్ల పాము.. ఎంత పనిచేసిందంటే..?

ఎందుకంటే..కట్లపాము చూసేందుకు చిన్నగా ఉన్నా ప్రమాదకరమైనది. కాటు వేస్తే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నించినా పాము మాత్రం బయటకు రావడం లేదు. స్కూటర్ కు పోగ పెట్టి, పైప్ తో నీళ్లు కొట్టినా బయటకు రాలేదు. కట్లపాము స్కూటర్ లో తిష్ట వేసింది. స్కూటర్ వెనకవైపుకి వచ్చి సీటు కిందిభాగంలో ఉండిపోయింది.

Watch: స్నేకా.. మజాకా..!  టీచర్ స్కూటీలో దూరిన కట్ల పాము.. ఎంత పనిచేసిందంటే..?
Snake Enters Scooty
Follow us
B Ravi Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 25, 2023 | 4:39 PM

ఏలూరు, నవంబర్‌24; పుట్టలో పాము స్కూటర్ డిక్కీ లోకి వచ్చి చేరితే ఎలా ఉంటుంది..అమ్మో.. ఇంకేమైనా ఉందా.? పామును చూడగానే ప్రాణం ఆగిపోతుంది..‌ ఏం చేయాలో, ఎలా తప్పించుకోవాలో తెలియక కళ్ళముందే నరకం కనిపిస్తుంది. ఎక్కడ కాటేస్తుందో అనే భయంతో వెళుతున్న బైకు లేదా స్కూటర్ను ఒక్కసారిగా వదిలేసి ప్రమాదాల బారిన పడుతున్నారు వాహనదారులు. ఇటీవలి కాలంలో స్కూటీలు, బైకులు, కార్లలో దూరిన పాములు భయపెడుతున్నాయి. ఏ డిక్కీలో ఏ పాము ఉందో, ఎక్కడ దాక్కున్ని ఉండి ఎప్పుడు కాటేస్తుందోననే భయంతో బిక్కుబిక్కుమంటూ వాహనాలను తీస్తున్నారు గ్రామాలు, శివారు ప్రాంతాల్లోని వాహనదారులు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిధిలోని ఓ గ్రామంలో యాక్టివా స్కూటర్‌లో దూరిన కట్లపాము హల్చల్ చేసింది. స్థానికంగా ఒక స్కూల్లో పని చేస్తున్న టీచర్ తన పిల్లలతో ఉదయాన్నే యాక్టివా పై స్కూల్ కి బయల్దేరింది. స్కూటర్ పై వెళుతుండగా ఒక్కసారిగా ఫ్రంట్ హెడ్లైట్ నుండి కట్లపాము చేతి దగ్గరికి వచ్చేసింది. భయాందోళనకు గురైన ఆమె వెంటనే స్కూటర్‌ను పక్కన వదిలేసి భర్తకు సమాచారం అందించింది. పాము స్కూటర్ లోనే ఉందని భర్త రాగానే విషయం చెప్పి అక్కడనుండి స్కూల్ కి వెళ్లిపోయింది. స్కూటర్ లో పామును చూసి భయాందోళనకు గురయ్యాడు స్కూటర్ యజమాని. విషపూరితమైన కట్లపాము కావడంతో పామును బయటికి రప్పించేందుకు స్థానికులు కూడా భయపడ్డారు.

ఎందుకంటే..కట్లపాము చూసేందుకు చిన్నగా ఉన్నా ప్రమాదకరమైనది. కాటు వేస్తే ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నించినా పాము మాత్రం బయటకు రావడం లేదు. స్కూటర్ కు పోగ పెట్టి, పైప్ తో నీళ్లు కొట్టినా బయటకు రాలేదు. కట్లపాము స్కూటర్ లో తిష్ట వేసింది. స్కూటర్ వెనకవైపుకి వచ్చి సీటు కిందిభాగంలో ఉండిపోయింది. చివరికి మెకానిక్ సాయంతో మూడు గంటలు శ్రమించిన తరువాత ఎట్టకేలకు ఆ పాము స్కూటీలోంచి బయటకు వచ్చిది. మెకానిక్ స్కూటర్‌ని ఏ పార్ట్‌కి ఆ పార్ట్‌గా విప్పి ఫోర్స్ గా వాటర్ కొట్టడంతో బయటికి వచ్చింది. అంతే వేగంగా ఆ పాము అక్కడ్నుంచి వెళ్లిపోయింది. పాము స్కూటర్ నుండి బయటకు రావడంతో యజమాని, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

చుట్టుపక్కల పొదలు, గడ్డి, అపరిశుభ్ర వాతావరణం ఉన్న ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అలాంటి ప్రదేశాల్లో ఉండే పాములు, పురుగులు వంటివి వాహనాల్లోనికి చేరే ప్రమాదం ఉంటుంది. శుభ్రమైన ప్రదేశంలో వాహనాలను పార్క్ చేయడం, అప్రమత్తంగా వ్యవహరించటం చాలా ముఖ్యమని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..