Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఏకం చేసే పనిలో వైసీపీ.. ఏపీలో కొనసాగుతున్న సామాజిక యాత్రలు

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ సామాజిక సాధికార యాత్రలకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోంది. శనివారం తుని, పెందుర్తి నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు కొనసాగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ ఎలాంటి మేలు చేశారో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఏకం చేసే పనిలో వైసీపీ.. ఏపీలో కొనసాగుతున్న సామాజిక యాత్రలు
YSRCP Social Empowerment bus trip in Sri Sathya Sai District
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 25, 2023 | 9:03 PM

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ సామాజిక సాధికార యాత్రలకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోంది. శనివారం తుని, పెందుర్తి నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు కొనసాగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్‌ ఎలాంటి మేలు చేశారో వివరిస్తూ ముందుకు సాగుతున్నారు మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధులు. బడుగు, బలహీన వర్గాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రులు వివరించారు.

అనకాపల్లి జిల్లా పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజు అధ్వర్యంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. ముందుగా.. జీవీఎంసీ కళ్యాణ మండపంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు.. అనంతరం.. వేపగుంట నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు భారీ ర్యాలీ చేశారు. యాత్రలో భాగంగా సబ్బవరం జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభకు మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాంతోపాటు పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇక.. గవర్నమెంట్‌ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్‌ విద్యా భరోసా కల్పించారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు.

కాకినాడ జిల్లా తునిలో మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగింది. దానిలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో పేదల స్థితిగతులు మార్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్‌ అన్నారు మంత్రి మేరుగు నాగార్జున.

మొత్తంగా.. రెండో విడత వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పేద, బడుగు బలహీన వర్గాలకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని వివరించడమే లక్ష్యంగా బస్సు యాత్రలు నిర్వహిస్తూ.. పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపుతోంది వైసీపీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…