కోనసీమ శ్రీనివాసుడు కోటీశ్వరుడే.. 34 రోజులకు గాను హుండీ ఆదాయం !!
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం నానాటికీ పెరుగుతోంది. ఏడువారాలస్వామిగా పూజలందుకుంటూ కొలిచేవారి కొంగుబంగారంగా వెలుగొంతున్నాడు వాడపల్లి శ్రీనివాసుడు. ఎర్రచందనం చెక్కలో వెలసిన శ్రీనివాసుడు ఏడువారాలు తన దర్శన భాగ్యంతో భక్తుల కోర్కెలు నెరవేర్చుతాడని ప్రజలు విశ్వసిస్తారు. ప్రతి శనివారం స్వామి దర్శనానికి చుట్టుపక్కల జిల్లాలనుంచి సైతం భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తారు.
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం నానాటికీ పెరుగుతోంది. ఏడువారాలస్వామిగా పూజలందుకుంటూ కొలిచేవారి కొంగుబంగారంగా వెలుగొంతున్నాడు వాడపల్లి శ్రీనివాసుడు. ఎర్రచందనం చెక్కలో వెలసిన శ్రీనివాసుడు ఏడువారాలు తన దర్శన భాగ్యంతో భక్తుల కోర్కెలు నెరవేర్చుతాడని ప్రజలు విశ్వసిస్తారు. ప్రతి శనివారం స్వామి దర్శనానికి చుట్టుపక్కల జిల్లాలనుంచి సైతం భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తారు. ఇలా నానాటికీ భక్తుల సంఖ్యతోపాటు హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. తాజాగా ఆలయ అధికారులు స్వామివారి హుండీ లెక్కించారు. 34 రోజులకు గాను హుండీ ఆదాయం మొత్తం 96,67,708 రూపాయలు హుండీ ఆదాయంగా వచ్చిందని వెళ్లడించారు. ఆలయ ప్రధాన హుండీ ఆదాయం 68,60,512 రూపాయలు కాగా, అన్న ప్రసాదం హుండీలద్వారా28,07,196 రూపాయలు, భక్తులు కానుకల రూపంలో సమర్పించారని వెల్లడించారు. ఇక బంగారం, వెండి కూడా భారీగానే వచ్చాయి. 38 గ్రాముల బంగారం, 538 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు తెలిపారు. అంతేకాదు, స్వామివారి హుండీలో విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్టు తెలిపారు. 22 నవంబంరు నాడు ఆలయ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగినట్టు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీవర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీచేసిన వాతావరణశాఖ
రిపోర్టర్‌కు ముద్దు పెట్టిన స్టార్ హీరో !!
Trisha: షాకింగ్.. అల్లు అర్జున్‌కు హీరోయిన్‌గా త్రిష అట
Vijay Devarakonda: పాపం ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది..
Bhagavanth Kesari: అప్పుడో.. ఇప్పుడో కాదు.. సరిగ్గా ఆ రోజే..