చైనాలో అంతుబట్టని మరో మహమ్మారి..చిన్నారుల పాలిట

చైనాలో అంతుబట్టని మరో మహమ్మారి..చిన్నారుల పాలిట

Phani CH

|

Updated on: Nov 25, 2023 | 9:20 PM

చైనాలో పుట్టి, యావత్‌ ప్రపంచాన్ని రెండున్నరేళ్లపాటు గడగడలాడంచిన మహమ్మారి కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. దాదాపు ప్రజలు కరోనాను మర్చపోయే స్థితికి వచ్చారు. ఈ క్రమంలో మరోసారి తన పంజా విసురుతోంది కరోనా. ఈసారి న్యూమోనియా రూపంలో అలజడి చేపుతోంది. చైనాలోనే పుట్టిన ఈ కొత్త వైరస్‌ పాఠశాలల ద్వారా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. ఈ కొత్తవేరియంట్‌ ప్రభావంతో ఊపిరితిత్తుల వాపు, తీవ్రమైన జ్వరంతోపాటు అసాధారణ లక్షణాలు పిల్లల్లో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

చైనాలో పుట్టి, యావత్‌ ప్రపంచాన్ని రెండున్నరేళ్లపాటు గడగడలాడంచిన మహమ్మారి కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. దాదాపు ప్రజలు కరోనాను మర్చపోయే స్థితికి వచ్చారు. ఈ క్రమంలో మరోసారి తన పంజా విసురుతోంది కరోనా. ఈసారి న్యూమోనియా రూపంలో అలజడి చేపుతోంది. చైనాలోనే పుట్టిన ఈ కొత్త వైరస్‌ పాఠశాలల ద్వారా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. ఈ కొత్తవేరియంట్‌ ప్రభావంతో ఊపిరితిత్తుల వాపు, తీవ్రమైన జ్వరంతోపాటు అసాధారణ లక్షణాలు పిల్లల్లో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ.. కొవిడ్-19 నాటి పరిస్థితులు కల్పిస్తుందేమోననే ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి పట్ల చైనా ఆరోగ్య వ్యవస్థ కలవరం చెందుతోంది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పిల్లలు అనారోగ్యానికి గురవ్వడంతో తల్లిదండ్రులు హాస్పిటల్స్‌ నిండిపోతున్నాయి. రోగులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో బీజింగ్, లియానింగ్‌ ప్రావిన్స్‌లలోని ఆసుపత్రుల వనరులు అడుగంటే స్థితికి చేరుకుంటున్నాయని తెలుస్తోంది. కాగా కొత్త రకం న్యుమోనియా వ్యాప్తి కారణంగా పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని స్థానిక మీడియా తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోనసీమ శ్రీనివాసుడు కోటీశ్వరుడే.. 34 రోజులకు గాను హుండీ ఆదాయం !!