భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ మహిళను ప్రశ్నిస్తున్న పోలీసులు
పబ్జీ ఆడుతూ ఉత్తరప్రదేశ్‌లోని ఓ యువకుడి ప్రేమలో పడ్డ పాకిస్థాన్ మహిళ సీమా గులాం హైదర్ ఇటీవల ఇండియాకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన నలుగురు పిల్లలతో సహా తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లోనే నివాసముంటోంది.

పబ్జీ ఆడుతూ ఉత్తరప్రదేశ్‌లోని ఓ యువకుడి ప్రేమలో పడ్డ పాకిస్థాన్ మహిళ సీమా గులాం హైదర్ ఇటీవల ఇండియాకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన నలుగురు పిల్లలతో సహా తన ప్రియుడు సచిన్ మీనా ఇంట్లోనే నివాసముంటోంది. అయితే సీమా గులాం భారత్‌కు అక్రమంగా ప్రవేశించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. అలాగే ఆమె ప్రియుడు సచిన్ మీనా, అతని తండ్రిని కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన తీవ్రవాద నిరోధక దళం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీమకు ఇండియాకు చెందిన సచిన్ (22)తో 2019 లో పబ్జీ ఆడుతుండగా పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.
దీంతో ఇటీవల సీమా తన నలుగురు పిల్లలను తీసుకొని దుబాయ్ మీదుగా నేపాల్‌కు వెళ్లింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇండియాకు వచ్చింది. ప్రస్తుతం సీమా, తన ప్రియుడు సచిన్ మీనాతో గ్రేటర్ నొయిడాలో అద్దెకు ఉంటున్నారు. సచిన్ అక్కడే ఓ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అయితే సీమా భారత్‌కు అక్రమంగా వచ్చిందన్న విషయం జులై 4న పోలీసులకు తెలిసింది. దీంతో వారు సచిన్, సీమాలను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిద్దరికి బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా సౌదీ అరేబియాలో ఉంటున్న సీమా భర్త గులాం హైదర్.. తన భార్యను పాకిస్థాన్‌కు పంపించాలని కోరుతున్నాడు. ఆమెను ఇప్పటికీ ప్రేమిస్తున్నానని తెలిపాడు. కానీ సీమా మాత్రం తన భర్త సచిన్ హిందువని.. ఇప్పుడు తాను కూడా హిందువునేనని, భారతీయురాలికి భావిస్తున్నట్లు చెప్పింది.




