Oommen Chandy: కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో మృతి చెందారు. 1943 అక్టోబర్ 31 న ఊమెన్ చాందీ జన్మించారు.

కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో మృతి చెందారు. 1943 అక్టోబర్ 31 న ఊమెన్ చాందీ జన్మించారు. ఆయన స్వస్థలం కొట్టాయం జిల్లా పుతప్పల్లి. మగ్గురు సంతానం. కేరళలో ఆయన ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కేరళకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అంతేకాకుండా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
అయితే ఊమెన్ చాందీ మరణంతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సహా పలువురు పార్టీ నేతలు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు. ఊమెన్ చాందీ పార్థీవ దేహాన్ని బెంగళూరు నుంచి కేరళలోని తిరువనంతపురానికి తరలిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి కొట్టాయంకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అలాగే కేరళ ప్రభుత్వం ఆయన గౌరవార్థం రెండు రోజులు సంతాప దినాన్ని ప్రకటించింది.




