AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జెట్స్‌ను పేల్చేసిన పాకిస్థాన్‌..? ఇందులో నిజమెంత? క్లియర్‌ కట్‌ న్యూస్‌

ఏప్రిల్ 22న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం సంయుక్తంగా ఆపరేషన్ సుందర్ నిర్వహించింది. పాకిస్తాన్‌లోని 9 లక్ష్యాలపై దాడి జరిగింది. జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఫేక్ అని తేలింది.

Operation Sindoor: ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జెట్స్‌ను పేల్చేసిన పాకిస్థాన్‌..? ఇందులో నిజమెంత? క్లియర్‌ కట్‌ న్యూస్‌
Jet
SN Pasha
|

Updated on: May 07, 2025 | 4:51 PM

Share

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఇండియన్‌ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించాయి. పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కలుపుకొని మొత్తం తొమ్మిది లక్ష్యాలపై దాడులు చేసిన భారత్‌. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న జైష్-ఎ-మొహమ్మద్ (జెఎమ్), లష్కరే-ఎ-తోయిబా (ఎల్‌ఇటి) అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టారు. మే 7 అర్ధరాత్రి 1.05 నుంచి 1.30 మధ్య ఈ దాడి కొనసాగినట్లు ఆర్మీ అధికారిణి కల్నల్‌ సోఫియా ఖురేషీ వెల్లడించారు.

అలాగే దాడి కంటే ముందు, దాడి తర్వాత ఉగ్రవాద స్థావరాలకు సంబంధించిన ఫొటోలను కూడా ఇండియన్‌ ఆర్మీ విడుదల చేసింది. అయితే.. ఇక వైపు ప్రపంచ మొత్తం భారత్‌ చేసిన ఈ ఆపరేషన్‌ సిందూర్‌ గురించి మాట్లాడుకుంటుంటే.. కొంతమంది పాకిస్థాన్‌ అధికారులు, పాక్‌ పౌరులు ఫేక్‌ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. గతంలో ఇండియాలో ప్రమాదవశాత్తు కూలిన ఎయిర్‌ ఫోర్స్‌ జెట్ల ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ.. ఇదిగో పాకిస్థాన్‌ ఆర్మీ భారత జెట్లను కూల్చేసింది, గాల్లోనే పేల్చేసింది అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.

Fake News

అయితే.. అధికారికంగా పాకిస్థాన్‌ ప్రభుత్వం కానీ, పాకిస్థాన్‌ ఆర్మీ కానీ భారత జెట్ల కూల్చివేత గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎందుకంటే.. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జెట్లు ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించాయి. పైగా మనకు ఎలాంటి నష్టం కూడా కలగలేదు. అయితే.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలు అన్ని ఫేక్‌ అని తేలింది. పాత వీడియోలను ఇప్పుడు పోస్ట్‌ చేస్తూ.. కొంతమంది కావాలనే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి