Defence: యూపీఏ ప్రభుత్వ హయాంలో రక్షణ కోసం భారీ ఆర్డర్లు.. వెల్లడించిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్

యుపిఎ నేతృత్వంలోని ప్రభుత్వం పదేళ్ల కాంగ్రెస్(Congress) పాలనలో రక్షణ కోసం ఏమీ సేకరించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం రాజ్యసభలో అన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి రక్షణ కొనుగోళ్లను చేపట్టకపోవడంతో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పిన్ నుంచి విమానం వరకు అన్నీ కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు.

Defence: యూపీఏ ప్రభుత్వ హయాంలో రక్షణ కోసం భారీ ఆర్డర్లు.. వెల్లడించిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్
Indian Army
Follow us
KVD Varma

|

Updated on: Mar 29, 2022 | 8:28 PM

(ఆకాష్ గులాంకర్)

యుపిఎ నేతృత్వంలోని ప్రభుత్వం పదేళ్ల కాంగ్రెస్(Congress) పాలనలో రక్షణ కోసం ఏమీ సేకరించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం రాజ్యసభలో అన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి రక్షణ కొనుగోళ్లను చేపట్టకపోవడంతో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పిన్ నుంచి విమానం వరకు అన్నీ కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. అయితే, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ఆయుధ వ్యాపార డేటా విశ్లేషణ ఆర్ధిక మంత్రి ప్రకటన కంటే చాలా భిన్నంగా కనిపిస్తోంది. ఈ పదేళ్ల కాంగ్రెస్ హయాంలో భారత్ 30 బిలియన్ డాలర్లకు పైగా ఆయుధ ఒప్పందాలను ముగించిందని ఆ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందాలలో ప్రధానంగా విమానం, రాడార్, హెలికాప్టర్లు, క్షిపణులు అలాగే అనేక ఇతర ఆయుధ సంబంధిత యంత్రాలు ఉంటాయి. కానీ అప్పట్లో జరిగిన ఒప్పందాలు వాటికి మాత్రమే పరిమితం కాలేదు.

SIPRI  డేటా ఏం చెబుతోంది?

SIPRI ఆయుధ వ్యాపార డేటా ప్రకారం, భారతదేశం 2004 నుండి 2014 వరకు వివిధ ఆయుధాలు.. సంబంధిత వ్యవస్థలకు సంబంధించి మొత్తం 142 ఆర్డర్‌లను ఇచ్చింది. ఇది కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉన్న సమయం. . ఇతర చిన్న ఎగుమతిదారులతో పాటు రష్యా, USA, ఫ్రాన్స్, జర్మనీ..ఇజ్రాయెల్ వంటి ప్రధాన సరఫరాదారులతో సహా మొత్తం 17 దేశాలతో దిగుమతి ఒప్పందాలు జరిగాయి. ఆర్డర్లు ఇవ్వడం కూడా పూర్తయింది.

ఈ సమయంలో 499 విమానాలు..హెలికాప్టర్లు ఆర్డర్ చేశారు. వీటిలో గస్తీ, రవాణా విమానం/హెలికాప్టర్ల వివిధ శ్రేణులు, అనేక సామర్థ్యాల యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ ఆర్డర్లు ప్రధానంగా ఫ్రాన్స్ (30 హెలికాప్టర్లు మరియు 49 FGA విమానాలు), రష్యా (148 హెలికాప్టర్లు మరియు 210 విమానాలు) , USA (6 హెలికాప్టర్లు మరియు 20 విమానాలు) దేశాలకు ఇచ్చారు. ఈ ఒప్పందాలలో ప్రసిద్ధ చిరుత హెలికాప్టర్లతో పాటు MIG విమానాలు కూడా ఉన్నాయి.

కాంగ్రెస్ పాలనలో దశాబ్దంలో జరిగిన ఇతర ఒప్పందాలలో యాంటీ షిప్, ట్యాంక్ నిరోధక క్షిపణుల సేకరణ, కొన్ని ఇతర విభాగాల పేలుడు ఆయుధాలు ఉన్నాయి. ఈ సమయంలో ఇటువంటి 40,000 కంటే ఎక్కువ క్షిపణుల కోసం మొత్తం 29 ఆర్డర్‌లు చేశారు. ఈ ఒప్పందాలు దాదాపు3 బిలియన్ డాలర్లు. SIPRI డేటా ప్రకారం, ఈ ఆర్డర్‌లలో దాదాపు 90 శాతం రష్యాకు ఇచ్చారు. మిగిలిన ఒప్పందాలు ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఉక్రెయిన్ మరియు USAలతో చేసుకున్నారు.

ఈ ఒప్పందాలలో యుద్ధనౌకలు (చిన్న యుద్ధనౌకలు), ఇతర నౌకాదళ ఆయుధాలు కూడా ఉన్నాయి. SIPRI డేటా ప్రకారం, భారతదేశం 2006 – 2004 సంవత్సరాల్లో వరుసగా 1 బిలియన్ల దాలరాల్ డీల్స్‌లో రష్యా నుండి 3 యుద్ధనౌకలు, ఒక విమాన వాహక నౌకను కొనుగోలు చేసింది. ఇతర ఒప్పందాలలో ఇజ్రాయెల్, ఇటలీ, రష్యా నుంచి కొనుగోలు చేసిన నౌకాదళ తుపాకులు మరియు క్షిపణుల వ్యవస్థలు ఉన్నాయి.

మిగిలిన ఒప్పందాలలో రాడార్ వ్యవస్థలు, వివిధ రకాల క్షిపణులు, క్షిపణి వ్యవస్థలు, సోనార్, సాయుధ వాహనాలు, డీజిల్ ఇంజన్లు, ఇతర ఆయుధాలు ఉన్నాయి. డేటా ప్రకారం ఈ డీల్స్ విలువ 14 బిలియన్ డాలర్లు.

చాలా డీల్‌ల వాస్తవ విలువలు బహిర్గతం కాలేదు. ఆ డీల్‌లు వెల్లడించిన వాటి కంటే పెద్దవి కావచ్చు. అందువల్ల, దిగుమతుల వాస్తవ విలువలు SIPRI పబ్లిక్‌గా అందుబాటులో ఉంచిన డేటాలో చూపే దానికంటే ఎక్కువగా ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి:  TDP 40 Years: తెలుగు జాతి చరిత్రకు ఓ మలుపు.. 40 ఏళ్ల ప్రస్థానానికి పునాది.. పుట్టుక నుంచి..

అంతా బుల్డోజర్ బాబా మహత్యం.. రెండు వారాల్లో 50 మందికి పైగా నేరస్థులు లొంగిబాటు.. క్యూలో మరికొందరు!