Srinagar Encounter: శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న ఆపరేషన్..

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా.. జమ్మూలోని శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో

Srinagar Encounter: శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న ఆపరేషన్..
Kashmir Encounter
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 30, 2022 | 3:19 AM

Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా.. జమ్మూలోని శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. కాగా.. శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరూ లష్కరే తోయిబా / టిఆర్‌ఎఫ్‌కి చెందిన స్థానిక ఉగ్రవాదులని ఐజిపి కశ్మీర్ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇటీవల జరిగిన పౌర హత్యలతోపాటు పలు ఉగ్రవాద నేరాలలో విరిద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా.. రైనావారి ప్రాంతంలో ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. సోమవారం ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. బుద్గామ్‌లోని సునేగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిని దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాకు చెందిన వసీమ్‌ అహ్మద్‌ గనై, ఇక్బాల్‌ అష్రఫ్‌ షేక్‌గా గుర్తించారు. వారి నుంచి ఒక చైనీస్ పిస్టల్, రెండు పిస్టల్ మ్యాగజైన్‌లు, 12 పిస్టల్ రౌండ్‌లు, 32 ఎకె-47 రౌండ్‌లతో సహా నేరారోపణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలాఉంటే.. జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ప్రత్యేక పోలీసు అధికారి (SPO), అతని సోదరుడు మరణించారు. ఎస్పీఓ ఇష్ఫాక్ అహ్మద్‌ ను ఇంటి సమీపంలోనే ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనలో అహ్మద్ సోదరుడు ఉమర్ జాన్ కు కూడా తీవ్రగాయాలు కాగా.. ఆయన చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.

Also Read:

SRH vs RR – IPL 2022: సన్‌రైజర్స్‌కు షాక్.. 61 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం..

Tirumala: ఉగాదిని పురష్కరించుకుని.. స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..