Crime News: బెంగాల్‌లో మరో నిర్భయ.. సెల్‌ఫోన్ కోసం చెల్లిని మృగానికి అప్పగించిన అక్క..
Bengal Rape case: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలనుప్పటికీ.. మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. పశ్చిమ బెంగాల్‌లో నిర్భయ లాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది.
Bengal Rape case: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలనుప్పటికీ.. మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. పశ్చిమ బెంగాల్‌లో నిర్భయ లాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ అక్క తన స్వార్థం కోసం.. చెల్లిని బలిచేసింది. డబ్బు సెల్‌ఫోన్ కోసం 11 ఏల్ల బాలికను అక్క.. ఆమె ప్రియుడికి అప్పగించింది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గుడు.. ఆమెను పలు రకాలుగా చిత్రహింసలు పెట్టాడు. దీంతో ఆమె చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బషీర్ హట్లో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ 24 పరగణాల జిల్లాలోని బషీర్హట్ సబ్ డివిజన్‌కు చెందిన యువకుడు, యువతి గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రియురాలికి చెల్లెలు వరసయ్యే బాలికపై దుర్మార్గుడు కన్నేశాడు. బాలికను ఒక రాత్రి తన వద్ద ఉంచితే కొత్త మొబైల్ ఫోన్, డబ్బు ఇస్తానంటూ నిందితుడు ప్రియురాలికి ఆశ చూపాడు. దీంతో ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో చెల్లిని ప్రియుడి దగ్గరకు పంపింది. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన దుర్మార్గుడు.. ఆమెను కర్రతో కొడుతూ దారుణంగా చిత్రహింసలు పెట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
అనంతరం బాలిక మృతి చెందిందేమోన్న భయంతో ఆ కామాంధుడు బాలికను ఫీషరిస్ సమీపంలో వదిలి వెళ్లాడు. బాలికను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికను చికిత్స నిమిత్తం కోల్‌కతా ఆసుపత్రికి తరలించారు. ఆరుగురు వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షిస్తోందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని హౌరా జిల్లాలోని దోమ్‌జూర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Also Read: