Pakistan: దాయాది దేశం పాకిస్థాన్‌‌లో రాజకీయ అస్థిరత.. భారత్ ఆందోళన.. ఎందుకంటే?

Pakistan Political Conflict: పాకిస్థాన్‌లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఇక్కడ జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేస్తున్న కుట్రలో వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపించారు.

Pakistan: దాయాది దేశం పాకిస్థాన్‌‌లో రాజకీయ అస్థిరత.. భారత్ ఆందోళన.. ఎందుకంటే?
Pakistan Political Conflict, Imran Khan
Follow us
Venkata Chari

|

Updated on: Mar 29, 2022 | 4:30 PM

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు, పాకిస్తాన్(Pakistan) ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pakistan PM Imran Khan) ఆదివారం ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ వేలాది మందిని ఆకర్షించింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే భారత్‌లోని టీవీల్లోనూ ఈ ర్యాలీని ప్రముఖంగా చూపించారు. అయితే ఇందుకు కారణం మాత్రం చాలా సరళంగానే కనిపిస్తోంది. పొరుగున జరుగుతోన్న పరిణామాలపై భారత్‌లోనూ ఆందోళన కలిగించేదిగా మారింది. ఇక ర్యాలీ గురించి మాట్లాడితే, దాదాపు రెండు గంటలపాటు జరిగిన మారథాన్ ప్రసంగంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, తన సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరుగుతోన్న “కుట్ర”లో విదేశీ శక్తులు పాల్గొన్నాయని పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్ పార్టీ(Pakistan Tehreek-E-Insaf Party) ర్యాలీ జరిగింది. కాగా, దేశ విదేశాంగ విధానాన్ని నిర్ణయించడానికి విదేశీ అంశాలతోపాటు స్థానిక రాజకీయ నాయకులను ఉపయోగించుకుంటున్నాయని ఆయన విమర్శించారు. అయితే ఆయన విమర్శలన్నీ అమెరికావైపు ఉన్నాయని తెలుస్తోంది. కాగా, భారత్‌ను పొగడడంతో ఈ చర్చ మరింత ఉత్కంఠగా మారింది. అయితే పాకిస్తాన్‌లోని దేశ, విదేశాంగ విధానాలను ఆర్మీ నియంత్రిస్తుందని అందరికీ తెలిసిన విషయమే.

విదేశాలు కూడా ఈ కుట్రలో భాగమేనని ధృవీకరించే లేఖ తన వద్ద ఉందని అతను నొక్కి చెప్పారు. ‘విదేశీ నిధుల ద్వారా పాకిస్థాన్‌లో ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన వాళ్ళని వాడుకుంటున్నారు. చాలా మందికి ఈ విషయం తెలియక పోయినా.. కొందరు మాత్రం ఈ సొమ్మును మాపై వాడుకుంటున్నారు. మాపై ఒత్తిడి తెచ్చేందుకు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. లిఖితపూర్వకంగా మమ్మల్ని బెదిరించారు. కానీ జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీపడబోం’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఇక వర్తమానాన్ని అర్థం చేసుకోవాలంటే పాకిస్తాన్ రాజకీయ చరిత్రను, భారత్‌పై చేసిన కుట్రలను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్రిటీష్ చేసిన భౌగోళిక, రాజకీయ ఆందోళనల నుంచి పాకిస్తాన్ పుట్టిందని చాలామంది వాదిస్తుంటారు. ఏ భౌగోళిక సరిహద్దులు లేకపోయిన పాకిస్తాన్ మిగిలిన భారత ఉపఖండంలో బలమైన చారిత్రక, మతపరమైన గుర్తింపును కలిగి ఉంది. అయితే పాకిస్తాన్ తన ప్రత్యేకతను చాటిచెప్పుకోవడానికి మతపరమైన రాజకీయాలను చేస్తూ విమర్శలపాలవుతోంది. ఇక స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో పాకిస్తన్ సైన్యం బలమైన సంస్థగా ఉంది. దీంతోనే కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్‌లో సైన్యం ఆ దేశ నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలపై తన ప్రభావాన్ని చూపిస్తుంది.

ఆగస్టు 14, 1947నుంచి పాకిస్తాన్ 22 మంది ప్రధాన మంత్రులుగా పనిచేశారు. అయితే, వీరిలో ఎవరూ ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేయలేదు. కేవలం ముగ్గురు, లియాఖత్ అలీ ఖాన్, యూసఫ్ రజా గిలానీ, నవాజ్ షరీఫ్ నాలుగు సంవత్సరాల కంటే కొద్ది రోజులు చేశారు. మెజారిటీ వర్గం మాత్రం రెండేళ్లకు మించి కొనసాగలేకపోయారు. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్ లాంటి సమస్యాత్మక రాజకీయ చరిత్రలో సైనిక నియంతలైన జనరల్ అయూబ్ ఖాన్, యాహ్వా ఖాన్(1958-71), జియా ఉల్ హల్ (1977-87), ముషారఫ్ (1999-2008) దాదాపు 32 సంవత్సరాలు(ప్రత్యక్షంగా, పరోక్షంగా) పాలించారు.

పాకిస్తాన్ రాజకీయాల్లో ఏదైనా మార్పు చోటుచేసుకుంటే, భారతదేశానికి ఎల్లప్పుడూ ఇబ్బందులను తెచ్చిపెడుతూనే ఉంటుంది. అయితే పాకిస్తాన్‌లో నిరంతరం రాజీకయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి రాజకీయ అస్థిరతతో శాంతికి విఘాతం కలిగిస్తూనే ఉంది. ఇక అయూబ్ శకాన్ని చాలామంది పాకిస్థానీయులు స్వర్ణకాలంగా గుర్తు చేసుకుంటుంటారు. అరవైల ప్రారంభంలో ఈ స్థిరత్వం నియంతకు తప్పుడు విశ్వాసాన్ని ఇచ్చింది. అతను 1965లో కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఆపరేషన్ జిబ్రాల్టర్‌ను ప్రారంభించాడు. అతను సైనికపరంగా విఫలమవ్వడమే కాకుండా పాకిస్తాన్‌ను ఎన్నటికీ కోలుకోని స్పైరల్ డైవ్‌లోకి నెట్టాడు.

కాగా, సంవత్సరాలుగా పాక్ చేస్తోన్న ప్రతీ ప్రయోగం దేశాన్ని మరింత గందరగోళానికి గురిచేస్తూనే ఉంది. అలాగే ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం మద్దతులో చేపట్టిన తాజా ప్రయోగం కూడా విఫలమైంది. ఇలాంటి ఎన్నో ప్రయోగాలతో విధ్వంసాలు వెంటాడినా.. ఆదేశ నాయకులు మాత్రం ఆ ధోరణిని మాత్రం వీడడంలేదు.

అయూబ్ శకం 1965 యుద్ధాన్ని అందించింది. తూర్పున రాజకీయ తిరుగుబాట్లు, భారీ మానవతా సంక్షోభానికి దారితీసింది. దీని ఫలితంగా యుద్ధం ద్వారా బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ తరువాత భుట్టో పాలన వచ్చింది. ఉపఖండంలో ఇస్లామీకరణ, న్యూక్లియర్‌ల ప్రయోగాల్లాంటి అభియోగాలు మోపారు. ఈ ఎజెండాను 80లలో జనరల్ జియా దూకుడుగా కొనసాగించారు. పంజాబ్, కాశ్మీర్, అస్సాంలలో తిరుగుబాటులతో భారీ విధ్వసం నెలకొల్పారు.

బెనజీర్, నవాజ్ షరీఫ్, ముషారఫ్ ఆధిపత్యంలో ఉన్న ఈ రాజకీయం పాక్‌లో తాలిబనీకరణను చూసింది. ఇది అల్-ఖైదా, లష్కరే-తైబ్బా, జమాత్-ఉద్-దవా వంటి ఉగ్రవాద సంస్థలను బలోపేతం చేసింది. వేలాది మంది మరణానికి దారితీసిన రాజకీయ లక్ష్యాలను సాధించే సాధనాలుగా వారు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేశారు. భారత పార్లమెంట్‌పై దాడి, ఆ తర్వాత ముంబై, ఉరీ, పుల్వామాలో జరిగిన దాడి జరిపారు.

నేడు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైంది. అమెరికన్ డాలర్‌తో పాకిస్తానీ రూపాయ ప్రస్తుతం 183 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటికే ఆ దేశం రూ. 50.5 ట్రిలియన్ల అప్పులతో నిలిచింది. పాక్ విదేశీ రిజర్వ్ ఆస్తులు $14,962 మిలియన్లకు పడిపోయాయి. ఇక ఓవైపు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కత్తి పాక్ మెడపై వేలాడుతోంది. అలాగే టెర్రరిస్టుల కోసం ఫైనాన్సింగ్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాకిస్థాన్ మరింత ప్రమాదంలోకి జారిపోతుందని సూచిస్తున్నాయి.

రోజురోజుకూ ఆర్థిక అగాధం తీవ్రమవుతున్నందున, ఇది చైనా ప్రమేయానికి మార్గం సుగమం చేస్తోంది. మార్చి 22-23 తేదీలలో ఇస్లామాబాద్‌లో జరిగిన OIC సమ్మిట్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పాల్గొనడం మొదటి సంకేతంగా నిలుస్తోంది. పాకిస్తాన్‌లో గంటగంటకూ విస్తరిస్తున్న రాజకీయ అనిశ్చితి కారణంగా చైనీయులకు దోపిడీకి దారి తీసింది. ఈ ఆర్థిక, రాజకీయ అస్థిరతకు అడ్డు అదుపులేకుండా పోతే, ప్రధాన అధికార దళారీగా ఎదుగుతున్న ఛాందసవాద శక్తుల పాత్రను తోసిపుచ్చలేం. ఇది చైనా-మద్దతు గల పాకిస్తాన్ సైన్యం, ఇస్లామిస్టుల మధ్య ఘర్షణకు దారితీయవచ్చు. ఇది భారతదేశంతోపాటు ఉపఖండానికి మరింత ఇబ్బందిని కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

Also Read: Karnataka: కర్ణాటకలో తెరపైకి మరో వివాదం.. ఆలయాల పరిసరాలల్లో హిందూయేతర వ్యాపారస్తులకు అనుమతి వద్దంటూ ప్రభుత్వానికి వినతి

Haryana: చపాతీ ఎక్కువ తిన్నదని అత్తగారిని కొట్టిన కోడలు.. పోలీసుల అదుపులో కోడలు, ఆమె ఫ్యామిలీ

MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారికి ఒకట్రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్.. ఎక్కడో కొడుతుంది సీనా..!
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
క్రికెట్ గాడ్ కొడుకు.. మెగా వేలంలో పాకెట్ మనీ ప్రైజ్‌కు కొనుగోలు
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
మెగా వేలంలో 2వ రోజు అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్స్ వీళ్లే..!
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..
వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..