Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??

బాబాగుడిలోకి ఎంట్రీ ఇచ్చిన అపర భక్తుడు..ఆ తర్వాత ??

Phani CH

|

Updated on: Nov 25, 2024 | 9:40 PM

కార్తీక మాసం కావడంతో ప్రస్తుతం ఆలయాన్నీ భక్తులతో రద్దీగా మారాయి. పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వచ్చి పూజలు చేస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే గుడికి వచ్చేవారంతా భక్తులే అనుకుంటే పొరపాటే నండోయ్‌.. ఇదిగో ఇలాంటి వారు కూడా ఉంటారు. అపర భక్తుల్లా గుడిలోకి ఎంట్రీ ఇస్తారు. ఎవరూ లేని సమయం చూసి పనికానిచ్చేస్తారు.

కష్టాలు తీర్చమని భగవంతుడి దగ్గరకు వచ్చి.. ఆయనకే శఠగోపం పెడతారు. తాజాగా అనంతపురం జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సాయిబాబా గుడిలోకి ఓ వ్యక్తి అపరభక్తుడిలా ఎంట్రీ ఇచ్చాడు. పంచ కట్టుకుని, మెడలో చక్కగా కండువా వేసుకొని వచ్చాడు. కాసేపు ఆలయ ప్రాంగణంలో అటూ ఇటూ తిరుగుతూ చుట్టూ పరికించాడు. రద్దీ తగ్గిన తర్వాత బాబాకు మొక్కుకుందాంలే అనుకున్నట్టుగా బిల్డప్‌ ఇచ్చాడు. భక్తులెవరు గుడి లోపలికి రాని సమయం కోసం ఎదురు చూశాడు. భక్తుల రద్దీ తగ్గిపోయింది. దాంతో బాబా విగ్రహం దగ్గరకు వెళ్లాడు. బాబాకి మొక్కుకుంటున్నట్టుగా మోకాళ్లపై వంగి నమస్కరించారు. ఈ క్రమంలోనే తన చేతివాటం ప్రదర్శించాడు. సాయిబాబాకు సంబంధించిన పంచలోహ విగ్రహం, వెండి చెంబు, గుళ్ళో గంటలు తన వెంట తెచ్చుకున్న బ్యాగులో సర్దుకున్నాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టుగా బయటకు వెళ్లిపోయాడు. తననెవరూ చూడలేదులే అనుకున్నాడు కానీ.. అక్కడ నిఘా కళ్లు ఉన్నాయన్న విషయం గుర్తించలేదు. ఇతగాడి బాగోతం అంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన పూజారి, ఆలయ ధర్మకర్తలకు సమాచారం ఇచ్చాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి, కేసు నమోదు చేసుకుని సదరు దొంగ కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే ??

మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్

వాట్సాప్‌లో సీక్రెట్‌ చాటింగ్‌.. ఈ ఫీచర్‌ ఎలా పని చేస్తుంది ??

యవ్వనం కోసం ఏదో చేస్తే.. ఇంకేదో అయ్యింది

హర్రర్ మూవీని తలపించిన అఘోరీ పూజలు !! చితాభస్మాన్ని ఒంటికి రుద్దుకుని ??