తన డ్రైవర్‌కే డ్రైవర్‌గా మారిన ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే ??
కొందరు యజమానులు తమ వద్ద పనిచేసే వర్కర్స్‌తో ఎంతో అభిమానంగా వ్యవహరిస్తారు. వారి కష్టసుఖాలను అర్థం చేసుకొని అవసరమైన సాయం చేస్తూ అండగా ఉంటారు. అవసరమైతే తమ హోదాను కూడా పక్కన పెట్టి చిన్న చిన్న పనులతో వర్కర్స్‌ని ఒక్కోసారి ఆశ్చర్యానికి గురిచేస్తారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఓ ఎమ్మెల్యే తన డ్రైవర్ వివాహ వేడుకలో స్వయంగా తానే కారు నడిపి వరుడికి డ్రైవర్‌గా మారాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా ధన్‌ఘటా అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు ఎమ్మెల్యే డ్రైవర్ పెళ్లికి సంబంధించిన వీడియో ఇది. ఈ వేడుకలో ఎమ్మెల్యే ఊహించని పని చేయడంతో పెళ్లికి వచ్చిన బంధువులు, స్థానికులు అంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. ధన్‌ఘటా అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ చౌహాన్ తన డ్రైవర్ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అంతేకాదు.. వరుడు కూర్చున్న కారును ఎమ్మెల్యే స్వయంగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
వాట్సాప్‌లో సీక్రెట్ చాటింగ్.. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది ??
యవ్వనం కోసం ఏదో చేస్తే.. ఇంకేదో అయ్యింది
హర్రర్ మూవీని తలపించిన అఘోరీ పూజలు !! చితాభస్మాన్ని ఒంటికి రుద్దుకుని ??
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

