Devdutt Padikkal IPL Auction 2025: వద్దాన్నోలే .. మళ్లీ తీసుకున్నారు..సొంత గూటికి చేరుకున్న పడిక్కల్ !
రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలానికి వచ్చిన దేవదత్ పడిక్కల్‌ను తొలి రౌండ్‌లో ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. అయితే చివర్లో వేలానికి తిరిగి వచ్చిన పడిక్కల్‌ను ఆర్‌సీబీ కొనుగోలు చేసింది.
Updated on: Nov 25, 2024 | 10:45 PM

IPL మెగా వేలం రెండో రోజు చివరి క్షణంలో RCB మరో కన్నడిగను కొనుగోలు చేసింది. ఆర్‌సీబీతో ఐపిఎల్ కెరీర్ ప్రారంభించిన యువ బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్‌ను ఆర్‌సిబి బేస్ ధర రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

గత ఎడిషన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఆడిన పడిక్కల్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. దానికితోడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. దీంతో లక్నో ఫ్రాంచైజీ పడిక్కల్‌ను జట్టు నుంచి విడుదల చేసింది.

అయితే 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలానికి వచ్చిన దేవదత్ పడిక్కల్‌ను తొలి రౌండ్‌లో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. అయితే చివర్లో వేలానికి తిరిగి వచ్చిన పడిక్కల్‌ను ఆర్‌సీబీ కొనుగోలు చేసింది.

నిజానికి, దేవదత్ పడిక్కల్ RCBలో చేరడం ఇదే మొదటిసారి కాదు. 2020 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అరంగేట్రం చేసిన పడిక్కల్, తన తొలి ఐపీఎల్ సీజన్‌లో ఐదు అర్ధసెంచరీలతో 473 పరుగులు చేశాడు.

RCB తరపున ఆడిన రెండు సీజన్లలో పడిక్కల్ మంచి ప్రదర్శన చేశాడు. ఒక సెంచరీ మరియు అర్ధ సెంచరీతో సహా మొత్తం 411 పరుగులు చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరిన పడిక్కల్ తొలి సీజన్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్ 2022లో 376 పరుగులు చేసిన పడిక్కల్, ఐపీఎల్ 2023లో 261 పరుగులు చేశాడు. అయితే 2024లో లక్నో జట్టులోకి వచ్చిన పడిక్కల్ 7 మ్యాచ్‌ల్లో 38 పరుగులు మాత్రమే చేశాడు.




