IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన ఆ ‘మిస్టరీ గర్ల్’ ఎవరు?
IPL-2025 మెగా వేలం నవంబర్ 24-25 తేదీలలో జెడ్డాలో జరుగుతోంది. తొలిరోజు వేలంలో రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు బిడ్ చేసింది. దీంతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. అయితే మెగా వేలంలో ఓ మిస్టరీ గర్ల్ అందరీ దృష్టిని ఆకర్షించింది.
Updated on: Nov 25, 2024 | 5:34 PM

రిషబ్ పంత్‌ను వేలం వేయడానికి కొద్దిసేపటి ముందు, శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితాలో మిచెల్ స్టార్క్‌ను అయ్యర్ అధిగమించాడు అని అనుకుంటుండగా పంత్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు.

ఈ వేలం పాటలో తొలిరోజే ఓ 'మిస్టరీ గర్ల్' అందరి దృష్టిని ఆకర్షించింది. తెల్లటి టీ-షర్ట్ దాని మీద ముదురు వెల్వెట్ జాకెట్ ధరించిన ఈ మిస్టరీ అమ్మాయి గురించి తెలుసుకోవాలని క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

ఈ 'కేకేఆర్ గర్ల్'కు ఓ ప్రముఖ బాలీవుడ్ నటితో అనుబంధం ఉంది. నిజానికి ఈ మిస్టరీ గర్ల్ జూహీ చావ్లా కూతురు జాన్వీ మెహతా. జూహీ చావ్లా ఆమె భర్త జే మెహతా కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమానులు.

.KKR IPLలో అత్యంత ఖరీదైన జట్లలో ఒకటి.. ఇప్పటివరకు 3 టైటిల్స్ గెలుచుకుంది. జాన్వీ తండ్రి జే మెహతా 'మెహతా గ్రూప్' అనే బహుళజాతి కంపెనీకి ఛైర్మన్.. జాన్వీ తల్లి జుహీ చావ్లా కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని మాత్రమే కాకుండా రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ యజమాని కూడా. జూహీ చావ్లా 1995లో జై మెహతాను వివాహం చేసుకున్నారు.

తన కూతురు జాన్వీకి క్రికెట్ అంటే చాలా ఇష్టమని జూహీ చావ్లా ఇప్పటికే చెప్పింది. జాన్వీకి క్రికెట్‌పై లోతైన అవగాహన ఉండటమే కాకుండా మ్యాచ్ వ్యూహాల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడుతుంది. జాన్వీకి క్రికెట్ అంటే ఎంత పిచ్చి అంటే రాత్రంతా మేల్కొని మ్యాచ్‌లు చూసేదట..

జాన్వీ కొలంబియా యూనివర్శిటీ నుండి తన చదువును పూర్తి చేసిన తర్వాత, జాన్వి డీన్‌ల జాబితాలో చోటు సంపాదించింది. ఆమె పరీక్షలలో అద్భుతంగా స్కోర్ చేసింది. ఇది కాకుండా జాన్వీకి పుస్తకాలతో చాలా అనుబంధం ఉంది. ఆమెకు పుస్తకాలు చదవడమే కాదు, రాయడం పట్ల కూడా ఆసక్తి ఉంది. తల్లి జుహీ చావ్లా ఆమెను 'బ్రైట్ గర్ల్' అని పిలవడానికి కారణం ఇదే.





























