MI IPL Auction 2025: భారీ హిట్టర్లు.. భయపెట్టే బౌలర్లు.. ముంబై ఇండియన్స్ టీమ్‌ను చూశారా?
Mumbai Indians IPL Auction Players : ముంబై జట్టులో ఇప్పటికే భారీ బ్యాటర్లు ఉన్నారు. అందుకేనేమో ఆ జట్టు మెగా వేలంలో స్టార్ బౌలర్లపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఎంతమందిని కొనుగోలు చేసిందో తెలుసుకుందాం రండి. అలాగే పూర్తి జట్టు ఎలా ఉందో ఒక లుక్కేద్దాం.
రోహిత్ శర్మ హయాంలో ముంబై ఇండియన్స్‌కు గోల్డెన్ టైమ్ నడిచింది. అతని నాయకత్వంలో MI గతంలో ఐదు IPL ట్రోఫీలను గెలుచుకుంది. అయితే గత ఐపీఎల్‌కు ముందు రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ముంబై ప్రకటించింది. అయితే పాండ్యా నాయకత్వలో ముంబై దారుణ ప్రదర్శన కనబరిచింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఏకంగా 10వ స్థానంలో నిలిచింది. అందుకే ఈసారి ముంబై మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. అందులో భాగంగానే సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన IPL మెగా వేలంలో ముంబై ఆచితూచి ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ ఈ ఏడాది మెగా వేలానికి ముందు 5 మంది క్రికెటర్లను తన వద్ద ఉంచుకుంది. 45 కోట్ల పర్స్ మనీతో ఆటగాళ్లను జట్టులోకి తీసుకునేందుకు ముంబై మెగా వేలానికి వెళ్లింది. ముంబై ఇండియన్స్ RTM ఉపయోగించి ఒక క్రికెటర్‌ను తీసుకునే అవకాశం వచ్చింది. మెగా వేలానికి ముందు రోహిత్ జట్టులో మొత్తం 20 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అందులో 8 మంది విదేశీ క్రికెటర్లను ఎంపిక చేసుకునే అవకాశం లభించింది.
IPL మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఏ క్రికెటర్లను రిటైన్ చేసిందో ఒకసారి చూద్దాం రండి..
- జస్ప్రీత్ బుమ్రా – 18 కోట్లు
- సూర్యకుమార్ యాదవ్ – రూ. 16.35 కోట్లు
- హార్దిక్ పాండ్యా – 16.35 కోట్లు
- రోహిత్ శర్మ – 16.30 కోట్లు
- తిలక్ వర్మ – 8 కోట్లు
MI IPL 2025 జట్టు: జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్ (రూ. 12.50 కోట్లు), నమన్ ధీర్ (రూ. 5.25 కోట్లు), రాబిన్ మింజ్ (రూ. 65 లక్షలు), కర్ణ్ శర్మ (రూ. 65 లక్షలు) రూ. 50 లక్షలు), ర్యాన్ రికెల్టన్ (రూ. 1 కోటి), దీపక్ చాహర్ (రూ. 9.25 కోట్లు), అల్లా గజన్‌ఫర్ (రూ. 4.80 కోట్లు), విల్ జాక్స్ (రూ. 5.25 కోట్లు), అశ్వనీ కుమార్ (రూ. 30 లక్షలు), మిచెల్ సాంట్నర్ (రూ. 2 కోట్లు), రీస్ టోప్లీ (రూ. 75 లక్షలు), కృష్ణన్ శ్రీజిత్ (రూ. 30 లక్షలు), రాజ్ అంగద్ బావా (రూ. 30 లక్షలు), సత్యనారాయణ రాజు (రూ. 30 లక్షలు), బెవాన్ జాకబ్స్ (రూ. 30 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ. 30 లక్షలు), లిజాద్ విలియమ్స్ (రూ. 75 లక్షలు), విఘ్నేష్ పుత్తూరు (రూ. 30 లక్షలు).
ముంబై వద్ద ఎంత పర్స్ మనీ ఉందంటే?
- ముంబై వద్ద ఉన్న పర్స్ మనీ : రూ. 20 లక్షలు.
- RTM కార్డ్‌లు: 0
- ప్లేయర్ స్లాట్స్: 2
- విదేశీ ప్లేయర్ల స్లాట్స్: 0
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..