నైజీరియాలో ఎంత మంది భారతీయులు ఉన్నారో తెలుసా..?

TV9 Telugu

18 November 2024

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నైజీరియా పర్యటనకి వెళ్లారు. ప్రధాని మోదీ శనివారం దేశ రాజధాని అబుజా చేరుకున్నారు.

అబుజాలో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఫెడరల్ క్యాపిటల్ టెరిటరీ మినిస్టర్ నెసోమ్ ఎజెన్‌వో వైక్ ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు.

ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు నైజిరియాలో ఉన్న భారతీయ కమ్యూనిటీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

అడుగడుగునా త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని ప్రధానిని కలిసేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు అక్కడి భారతీయులు.

17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని నైజీరియా పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ నైజీరియాలో పర్యటించనున్నారు.

నైజీరియా పశ్చిమ ఆఫ్రికాలోని ఒక దేశం. 2024 సంవత్సరానికి గానూ భారత విదేశాంగ శాఖ నివేదిక ప్రకారం నైజీరియాలో 51 వేల 800 మంది భారతీయులు నివసిస్తున్నారు.

2023 నివేదిక ప్రకారం నైజీరియా జనాభా 22.38 కోట్లు. అత్యధిక జనాభా ముస్లిం, క్రైస్తవ వర్గాలకు చెందినవారు. 2015 ప్రకారం, 50 శాతం ముస్లింలు, 48.1 శాతం క్రైస్తవులు నివసిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజుల పర్యటన నిమిత్తం మూడు దేశాలకు వెళ్లారు. నైజీరియా తర్వాత ప్రధాని మోదీ బ్రెజిల్, గయానాలో పర్యటించనున్నారు.