03 November 2024
TV9 Telugu
Pic credit - Social Media
అంగ్కోర్ వాట్ ఇది 'వైష్ణవాలయం' లేదా 'విష్ణుదేవాలయం'. ఈ ఆలయం కంబోడియాలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద హిందువుల దేవాలయంగా ప్రసిద్దిగాంచింది.
పశుపతినాథ ఆలయం.. నేపాల్‌లోని అతిపెద్ద ఆలయ సముదాయం. కేదార్నాథ్ ఆలయం దర్శనం తర్వాత్ పశుపతినాధు ఆలయం దర్శనం చేసుకోలనేది హిందువుల నమ్మకం.
ఇండోనేషియాలోని ప్రసిద్దిగాంచిన ప్రంబనన్ ఆలయం. దీనిని 9వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రికుల కథనం. ఈ ఆలయ గోడలపై రామాయణ ఇతిహాస గాధకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి.
మలేషియా పినాంగ్ లో బటు గుహలు బయట ఉన్న శ్రీ సుబ్రమణ్యస్వామి విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. 113 సంవత్సరాల పురాతన ప్రధాన ఆలయం.. నేల మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉన్న గుహలో ఉంది.
యూరోప్ లో మొట్టమొదటి హిందూ దేవాలయం లండన్‌లోని BAPS శ్రీ స్వామినారాయణ మందిర్ (నీస్డెన్ ఆలయం) విభిన్న సంస్కృతిపై ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించవలసిన ప్రదేశం.
శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్‌లోని ట్రింకోమలీ లోని పతిరకాళి అమ్మన్ ఆలయం. ఇది భద్రకాళి దేవతకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం.
హింగ్లాజ్ మాతా మందిర్ మన దాయాది దేశం పాకిస్తాన్ లోని బలూచిస్తాన్‌లోని లాస్బెలా జిల్లాలో ఉంది. ఈ అమ్మవారి ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి.
అమెరికాలోని న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో BAPS స్వామినారాయణ్ అక్షరధామ్.. USA లోని స్వామినారాయణ మందిరం విశ్వాసం, భక్తి , వాస్తు శిల్పకళా నైపుణ్యానికి ప్రతిరూపంగా నిలుస్తుంది.
బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద హిందూ దేవాలయం. ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయం బంగ్లాదేశ్ జాతీయ దేవాలయం. 51 శక్తి పీఠాలలో ఒకటి.
శ్రీ శివసుబ్రహ్మణ్య స్వామి మందిరం ఫిజీలో ఉంది. దక్షిణ అర్ధగోళంలో అతిపెద్ద హిందూ దేవాలయం. నాడి నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణం, శిల్పాలు, ద్రావిడ శిల్పకళకు ప్రసిద్ధి చెందింది.
తనహ్ లాట్ టెంపుల్ ఒక అందమైన ఆఫ్‌షోర్ కొండపై ఉంది. ఇండోనేషియాలోని బాలిలో అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. బాలి ద్వీపం నుండి వేరు చేయబడిన పెద్ద పగడపు రాతిపై నిర్మించబడింది.