Lakhimpur Kheri: ప్రత్యక్ష సాక్షులు 23 మందే ఉన్నారా.. ఎంత మందిని అరెస్ట్ చేశారు..

లఖింపూర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. వందల సంఖ్యలో రైతుల ర్యాలీలో నడుస్తుండగా, ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మంది మాత్రమేనా? అంటూ సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. మరింత మంది సాక్షులను సేకరించి వారికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు యూపీని ఆదేశించింది...

Lakhimpur Kheri: ప్రత్యక్ష సాక్షులు 23 మందే ఉన్నారా.. ఎంత మందిని అరెస్ట్ చేశారు..
Supreme
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 26, 2021 | 12:03 PM

లఖింపూర్ ఖేరీ ఘటనపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. వందల సంఖ్యలో రైతుల ర్యాలీలో నడుస్తుండగా, ప్రత్యక్ష సాక్షులు కేవలం 23 మంది మాత్రమేనా? అంటూ సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. మరింత మంది సాక్షులను సేకరించి వారికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు యూపీని ఆదేశించింది. “స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయడంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, న్యాయ అధికారులు అందుబాటులో లేకుంటే సమీపంలోని జిల్లా జడ్జిని సంప్రదించాలని ” సుప్రీం పేర్కొంది. విచారణ సందర్భంగా 68 మందిలో 30 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినట్టు యూపీ సర్కారు కోర్టుకు తెలిపింది. ఇందులో 23 మంది ప్రత్యక్ష సాక్షులున్నారని వెల్లడించింది. అక్కడ వందల మంది రైతులు ఉంటే కేవలం 23 మందే ప్రత్యక్షసాక్షులు ఉన్నారని ఎలా చెబుతారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

ఆధారాల రూపంలో మీడియా దృశ్యాలు అనేకం ఉన్నాయని.. వాటిని ధృవీకరించాల్సి ఉందని యూపీ సర్కారు పేర్కొంది. కారును చూసినవారు, కార్లో ఉన్న వ్యక్తులను చూసినవారు ఉన్నారని చెప్పింది. నిందితులుగా ఉన్న 16 మందిని గుర్తించామని కోర్టుకు తెలిపింది. ఏ కేసులోనై ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం కీలకమని, విశ్వసనీయం సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. సాక్షుల భద్రతపై ఆరా తీశారు. ప్రభుత్వ దర్యాప్తులో పురోగతిపై సంతృప్తి వ్యక్తి చేసిన ధర్మాసనం సాక్షులకు భద్రత కల్పించాల్సిందేనని యూపీ సర్కార్ స్పష్టం చేసింది. ఎనిమిది మంది హత్యకు సంబంధించి ఎంత మందిని అరెస్టు చేశారో, ఏ ఆరోపణలపై అరెస్టు చేశారో స్టేటస్ రిపోర్టులో జాబితా అందజేయాలని చేయాలని ఆదేశించింది. అలాగే ఈ ఘటనన జర్నలిస్ట్ రమణ్ కశ్యప్ సహా చనిపోయిన నలుగురి వ్యవహారంపై నమోదైన మరో ఎఫ్ఐఆర్‎ నివేదికను కోరిన సుప్రీం కోర్టు తదపరి విచారణను నవంబర్ 8కి వాయిదా వేసింది.

Read Also.. Madhya Pradesh: చూస్తుండగానే కుప్పకూలిన యుద్ధవిమానం.. వీడియో