Typhus Virus: మానవాళిపై పగబట్టిన వైరస్‌లు.. ఒడిశా టైఫస్ వైరస్ వెలుగులోకి .. 108 కేసులు నమోదు..
నిఫా వైరస్ కారణంగా కేరళ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతుండగా.. కొత్తగా స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఒడిశా రాష్ట్రం భయపడిపోతోంది. రోజురోజుకూ ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఒడిశాలో 180 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు ఒడిశా హెల్త్ డిపార్ట్‌మెంట్ గణాంకాలు వెల్లడించింది.

కరోనా వైరస్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి మానవాళిని రకరకాల వైరస్ లు వెంటాడుతూనే ఉన్నాయి. రెండేళ్లు భయపెట్టి బాధపెట్టిన కోవిడ్ అదుపులోకి వచ్చింది అని సంతోషం కొంత కాలం కూడా నిలవకుండా చేస్తున్నాయి.. నిఫా వైరస్ వంటివి. మన దేశంలో కేరళలో నిఫా వైరస్ వెలుగులోకి వచ్చి.. స్థానికులతో పాటు సరిహద్దు గ్రామాలను కూడా హడలెత్తిస్తోంది. నిఫా వైరస్ బెంబేలెత్తిస్తుండగా.. తాజాగా ఒడిశాలో మరో వ్యాధి బయటపడింది. ఇప్పటివరకు 180 కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొవిడ్‌తో పోలిస్తే ఈ వ్యాధి అంత ప్రమాదకరమైందా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
కేరళ రాష్ట్రాన్ని నిఫా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. ఇప్పటికే స్కూల్స్ కు ఆఫీసులకు సెలవులు ప్రకటించింది కేరళ ప్రభుత్వం. నివారణ కోసం చర్యలు చేపట్టింది. మరోవైపు నేను ఉన్నానంటూ.. ఒడిశాలో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. కొత్తగా స్క్రబ్ టైఫస్ వ్యాధి వెలుగులోకి రావడంతో ఒడిశా రాష్ట్రం వణికిపోతోంది. అంతేకాదు రోజురోజుకూ ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. వైరస్ కేసులు భారీగా నమోదు కావడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఒడిశాలో 180 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు ఒడిశా హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని ఒక్క సుందర్‌గఢ్ జిల్లాలోనే 11 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
కొత్త వైరస్ కేసులు పెరిగిపోతుండడంతో ఒడిశా వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన బాధితులకు అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఈ వైరస్ లక్షణాలున్నవారిని గుర్తించారు. మొత్తం 59 మంది శాంపిళ్లు పరీక్షించగా వారిలో 11 మందికి స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు చెప్పారు.




దీంతో రాష్ట్రంలో మొత్తం స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య 180 కి చేరినట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. బాధితుల్లో 10 మంది ఇతర రాష్ట్రాల వారున్నారని తెలిపారు. అంతేకాదు ఈ వైరస్ 9 జిల్లాల్లో ఉన్నట్లు బాధితుల ద్వారా తెలుస్తోందన్నారు.
క్రమంగా రాష్ట్రంలో కొత్త వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతు ఉండడంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్‌ను నివారణ కోసం అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బాధితులున్న జిల్లాలకు వైద్య బృందాలను పంపించి వైద్య సేవలను అందిస్తున్నారు. అంతేకాదు ముందు జాగ్రత్త చర్యలుగా అవసరమైన మందులు, వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామాల్లో ఆశా వర్కర్లు తిరుగుతూ జాగ్రత్తలు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..