Jayalakshmi: మా అమ్మ జయలలిత, మా నాన్న శోభన్‌బాబు..: జయలక్ష్మి వీడియో వైరల్..
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తానే అసలైన వారసురాలినని జె.జయలక్ష్మి చెప్పారు. తన తండ్రి దివంగత సినీ నటుడు శోభన్ బాబు అని ఆమె తెలిపారు. అవసరమైతే డీఎన్ఏ పరీక్షకు కూడా తాను సిద్ధమని చెప్పారు. జయలలిత మరణం తర్వాత తానే ఆమె అసలైన కూతురునని జయలక్ష్మి మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు మరోసారి మీడియా ముందుకు వచ్చిన జయలక్ష్మి తన గురించి చెప్పుకొచ్చారు. జయలలిత సినిమాల్లో నటించేటప్పుడు తాను ఆమెతో పాటే పోయెస్ గార్డెన్ లో […]
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తానే అసలైన వారసురాలినని జె.జయలక్ష్మి చెప్పారు. తన తండ్రి దివంగత సినీ నటుడు శోభన్ బాబు అని ఆమె తెలిపారు. అవసరమైతే డీఎన్ఏ పరీక్షకు కూడా తాను సిద్ధమని చెప్పారు. జయలలిత మరణం తర్వాత తానే ఆమె అసలైన కూతురునని జయలక్ష్మి మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు మరోసారి మీడియా ముందుకు వచ్చిన జయలక్ష్మి తన గురించి చెప్పుకొచ్చారు. జయలలిత సినిమాల్లో నటించేటప్పుడు తాను ఆమెతో పాటే పోయెస్ గార్డెన్ లో ఉండేదాన్నని జయలక్ష్మి తెలిపారు. ఆమె రాసుకున్న డైరీ, ఉపయోగించిన దుస్తులు, వస్తువులు తన వద్ద చాలా ఉన్నాయని, ఎన్నో కారణాల వల్ల తాను జయ కూతురునని అప్పట్లో చెప్పలేకపోయానని వెల్లడించారు. అమ్మ సీఎం అయిన తర్వాత కొన్ని పనులపై రెండు మూడు సార్లు కలిశానని, అపోలో ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నప్పుడు కూడా ఓసారి కలిశానని తెలిపారు. అఖిల భారత ఎంజీఆర్ మున్నేట్ర కళగం పేరుతో పార్టీని ప్రారంభించానని, లోక్ సభ ఎన్నికల్లో 39 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. దిండిగల్ జిల్లా కొడైకెనాల్ లో స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

