AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day: వచ్చే గణతంత్ర వేడుకల పరేడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఏంటో తెలిస్తే వావ్ అనాల్సిందే

కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌ వేడుకలో పోలీస్, ఆర్మీ, పారమిలటరీ దళాలు పాల్గొంటాయనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ వేడుకల్లో పురుషులు, మహిళలలు పాల్గొనేవారు. కానీ వచ్చే ఏడాది మాత్రం ఈ సంప్రదాయాన్ని మార్చనున్నారు.

Republic Day: వచ్చే గణతంత్ర వేడుకల పరేడ్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. ఏంటో తెలిస్తే వావ్ అనాల్సిందే
Republic Day Parade
Aravind B
|

Updated on: May 07, 2023 | 6:10 PM

Share

కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే పరేడ్‌ వేడుకలో పోలీస్, ఆర్మీ, పారమిలటరీ దళాలు పాల్గొంటాయనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ వేడుకల్లో పురుషులు, మహిళలలు పాల్గొనేవారు. కానీ వచ్చే ఏడాది మాత్రం ఈ సంప్రదాయాన్ని మార్చనున్నారు. 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో అందరూ మహిళలే కనిపించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సైనిక, ఇతర రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని, సాధికారతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్ణయం అమలుపై వివిధ శాఖల అధిపతులతో కసరత్తు జరుగుతున్నట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

అయితే గత మార్చిలోనే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొననున్న వివిధ రక్షణ సంస్థలు, ఆర్మీ, పోలీస్‌, పారామిలటరీలకు ఈ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పరేడ్‌కు నేతృత్వం వహించే దగ్గరి నుంచి బ్యాండ్‌ పార్టీ, శకటాల ప్రదర్శనల వరకు అందరూ మహిళలే ఉండనున్నారని కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ అధికారి తెలిపారు. మరోవైపు కేంద్రం నుంచి ఈ విషయంపై తమకు కూడా అధికారిక లేఖ అందిందని, అయితే, దీనిని ఎలా అమలు చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్సు ఆర్మీ వర్గాలు కూడా వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.