AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Free Rice: మధుమేహ బాధితులకు గుడ్‌న్యూస్.. షుగర్ ఫ్రీ రైస్‌ అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు.. మార్కెట్లోకి ఎప్పుడుంటే..

ప్రపంచంలోనే బియ్యం ఉత్పత్తిలో భారత్ నెంబర్ వన్. మరింత నాణ్యమైన బియ్యాన్ని తీసుకొచ్చేందుకు భారత పరిశోధకులు ప్రయత్నిస్తూనే ఉంటారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం ద్వారా కొత్త రకాల ధాన్యాలను అభివృద్ధి చేస్తున్నారు. వారి దృష్టి ఇప్పుడు షుగర్ ఫ్రీ రైస్‌పై పడింది.ఇప్పుడు IRRI షుగర్ ఫ్రీ రైస్‌ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది.

Sugar Free Rice: మధుమేహ బాధితులకు గుడ్‌న్యూస్.. షుగర్ ఫ్రీ రైస్‌ అభివృద్ధి చేస్తున్న శాస్త్రవేత్తలు.. మార్కెట్లోకి ఎప్పుడుంటే..
Rice
Sanjay Kasula
|

Updated on: May 07, 2023 | 6:38 PM

Share

భారతదేశంలో బియ్యం ఉత్పత్తి జాతీయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగం.దేశంలోని రైతులు మంచి జాతుల విత్తనాలను విత్తడం ద్వారా అధునాతన వ్యవసాయం చేస్తారు. రైతులు మంచి దిగుబడి కోసం ప్రయత్నిస్తారు. అదే సమయంలో, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ జాతుల ధాన్యాలను కూడా అభివృద్ధి చేస్తారు శాస్త్రవేత్తలు. ఇక్కడ మరో సమస్యై కూడా ఉంది. షుగర్ పేషెంట్ల సమస్య ఉంది. అలాంటి రోగులు ఎటువంటి స్వీట్ ఉన్న ఆహారాన్ని తినలేకపోతున్నారు. వారి ఆహారంలో సరైన మోతాదులో చక్కెరను ఉపయోగించడం చాలా ముఖ్యం. బియ్యంలో పంచదార చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అన్నం తినకూడదని సూచిస్తున్నారు.

తెల్లటి పాలిష్ వరి అన్నాన్ని తింటే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గోధుమ రంగులో ఉండే ముతకబియ్యపు అన్నం తినడం వల్ల ఈ ముప్పు తగ్గుతుంది. పాలిష్డ్‌ బియ్యం బదులు ముడి బియ్యం వినియోగిస్తే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పీచుపదార్థం, ఖనిజాలు, విటమిన్లు, ఫైటోకెమికల్స్‌ వంటి అవసరమైన పోషకాలు గోధుమరంగు బియ్యంలో ఎక్కువగా ఉంటాయి. భోజనం చేశాక.. రక్తంలో చక్కెర పరిమాణాన్ని కూడా ఎక్కువగా పెంచదు. బియ్యాన్ని పాలిష్‌ చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, పోతాయి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు భారత పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణకు సిద్దమవుతున్నారు.

వరి ఉత్పత్తికి సంబంధించి ఎంఓయూపై సంతకాలు చేశారు

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, బియ్యం ఉత్పత్తిని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (IRRI), ఉత్తరప్రదేశ్‌లోని 4 వ్యవసాయ విశ్వవిద్యాలయాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, బియ్యం ఆధారిత వ్యవసాయ-ఆహార వ్యవస్థను అభివృద్ధి చేసి గుణాత్మకంగా మార్పులతో సరికొత్త ఆవిష్కరణ చేయాలని నిర్ణయించారు. ఆచార్య నరేంద్ర దేవ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, బందా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, చంద్రశేఖర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, కాన్పూర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

షుగర్ ఫ్రీ రైస్ రకాన్ని అభివృద్ధి..

షుగర్ ఫ్రీ రైస్‌ని అభివృద్ధి చేయడం కూడా ఈ ఎంఓయూ ఉద్దేశం. వారణాసిలో ఉన్న ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సౌత్ ఏషియా రీజినల్ సెంటర్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్‌లు పెరుగుతున్న మధుమేహ వ్యాధిగ్రస్తులను దృష్టిలో ఉంచుకుని ఈ రకమైన రకాన్ని అభివృద్ధి చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మీడియా కథనాల ప్రకారం, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాన్ బెర్రీ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి సాంకేతికతను చేర్చడం అవసరమని అన్నారు. వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి, ఇందులో నిరంతర పరిశోధన అవసరం.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సహకరంతో..

ఈ ఒప్పందం చారిత్రాత్మకమని ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ షాహి అన్నారు. ఇది కొత్త రకాల వరిని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. వ్యవసాయం, రైతుల భవిష్యత్తును మెరుగుపరచడానికి ఇది పని చేస్తుంది. వ్యవసాయం, వ్యవసాయ విద్య, వ్యవసాయ పరిశోధన రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో 2018 సంవత్సరంలో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ స్థాపించబడింది. ఈ ఒప్పందాలతో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఆర్‌ఆర్‌ఐ మధ్య బలమైన సంబంధాలు ఏర్పడతాయని వ్యవసాయ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేది తెలిపారు. దీంతో వ్యవసాయం, రైతుల అభివృద్ధిలో గణనీయమైన అభివృద్ధి జరగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం