AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NDRF Twitter: దేశంలో హ్యాకింగ్ కలకలం.. ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన దుండగులు..

NDRF Twitter hacked: దేశంలో ఇటీవల కాలంలో ట్విట్టర్ ఖాతాల హ్యాక్ పరిపాటిగా మారింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా.. పలువురు కేంద్రమంత్రుల

NDRF Twitter: దేశంలో హ్యాకింగ్ కలకలం.. ఎన్డీఆర్ఎఫ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన దుండగులు..
Ndrf
Shaik Madar Saheb
|

Updated on: Jan 23, 2022 | 1:18 PM

Share

NDRF Twitter hacked: దేశంలో ఇటీవల కాలంలో ట్విట్టర్ ఖాతాల హ్యాక్ పరిపాటిగా మారింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా.. పలువురు కేంద్రమంత్రుల మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన అనంతరం ట్విట్టర్ సంస్థ కూడా స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొంది. అయితే.. తాజాగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) కి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్‌నకు గురైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఎన్డీఆర్ఎఫ్ అధికారికంగా వెల్లడించింది. శనివారం రాత్రి ట్విటర్‌ హ్యాండిల్‌ హ్యాక్‌ అయిందని దీనిపై నిపుణుల కమిటీ దర్యాప్తు చేస్తోందని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ వెల్లడించారు. సాంకేతిక నిపుణులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని, త్వరలో హ్యాండిల్‌ను పునరుద్ధరిస్తారని సీనియర్ ఫోర్స్ అధికారి ఆదివారం తెలిపారు. కొన్ని సందేశాలు NDRF Twitter హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే.. తాము చేసిన ట్వీట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.

ఎన్డీఆర్ఎఫ్ ఈ నెల 19న తన 17వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విపత్తులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్‌ను 2006లో ఏర్పాటు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తోంది. అయితే.. ఈ దళాలు అతి తక్కువ కాలంలోనే 1.44 లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. దేశంలో, విదేశాల్లో విపత్తు పరిస్థితుల నుంచి ఏడు లక్షల మందికి పైగా వ్యక్తులను ఎన్డీఆర్ఎఫ్ రక్షించింది.

ఎన్డీఆర్ఎఫ్ ఖాతాతోపాటు.. అంతకుముందు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ అయినట్లు అధికారులు తెలిపారు. హ్యాకర్లు ప్రొఫైల్ ఫోటోలో చేపల చిత్రాన్ని ఉంచి.. దానికి ఎలన్ మస్క్ పేరు రాశారు.

Also Read:

Crime News: రెచ్చిపోయిన మానవ మృగాలు.. యువతిపై సామూహిక అత్యాచారం.. మాట్లాడాలంటూ..

Single Sign On: అన్ని సేవలకు ఇకపై ఒకటే లాగిన్.. ‘సింగిల్ సైన్ ఆన్’ పేరుతో కేంద్రం సరికొత్త సర్వీస్..!