Crime News: రెచ్చిపోయిన మానవ మృగాలు.. యువతిపై సామూహిక అత్యాచారం.. మాట్లాడాలంటూ..
Woman gang-raped: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మానవ మృగాలు రోజురోజుకూ రెచ్చిపోతున్నాయి. తాజాగా దేశ ఆర్థిక రాజధాని
Woman gang-raped: దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మానవ మృగాలు రోజురోజుకూ రెచ్చిపోతున్నాయి. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతం గోవండిలో శనివారం 19 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మైనర్లు, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నాలుగో నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. యువతి ఓ క్యాటరింగ్ సంస్థలో పని చేసి ఇంటికి వెళుతుండగా శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పాత బెస్ట్ డిపో దగ్గర ఒంటరిగా ఉన్న యువతిని చూసిన ఓ నిందితుడు.. ఏదో విషయం గురించి మాట్లాడాలంటూ తీసుకెళ్లాడు. అనంతరం స్నేహితులతో కలిసి ఆమెను ఖాళీగా ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లి.. సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం గురించి చెప్పింది.
దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అప్పటికప్పుడు నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలను ఏర్పాటు చేసినట్లు శివాజీ నగర్ పోలీసు సీనియర్ ఇన్‌స్పెక్టర్ అర్జున్ రాజనే తెలిపారు. అనంతరం లోకమన్య టెర్మినస్ నుంచి పారిపోతున్న ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
నిందితులపై అత్యాచారం, లైంగిక వేధింపుల కింద ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని..శివాజీనగర్ పోలీసులు తెలిపారు.
Also Read: