PM Modi: మోదీ జీవితమంతా బీజేపీ కోసమే.. అదే పార్టీని విజయం వైపు నడిపించింది.. హర్యానా ఫలితాల వేళ ఆసక్తికర ట్వీట్..

బీజేపీనా.. కాంగ్రెస్సా.. క్షణం క్షణం ఉత్కంఠ.. రౌండ్‌ రౌండ్‌కీ ఆధిక్యాలు తారు మారు.. ట్రెండ్స్ వేరు.. ఫలితాలు వేరు అనేలా కమలం పార్టీ వికసించింది.. హ్యాట్రిక్ కొట్టింది.. హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టబోతోంది.. ఎగ్జిట్ పోల్స్.. ప్రారంభ ట్రెండ్స్ వీటన్నింటిని తలదన్నేలా తుది తీర్పు వచ్చింది.

PM Modi: మోదీ జీవితమంతా బీజేపీ కోసమే.. అదే పార్టీని విజయం వైపు నడిపించింది.. హర్యానా ఫలితాల వేళ ఆసక్తికర ట్వీట్..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 08, 2024 | 2:03 PM

బీజేపీనా.. కాంగ్రెస్సా.. క్షణం క్షణం ఉత్కంఠ.. రౌండ్‌ రౌండ్‌కీ ఆధిక్యాలు తారు మారు.. ట్రెండ్స్ వేరు.. ఫలితాలు వేరు అనేలా కమలం పార్టీ వికసించింది.. హ్యాట్రిక్ కొట్టింది.. హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టబోతోంది.. ఎగ్జిట్ పోల్స్.. ప్రారంభ ట్రెండ్స్ వీటన్నింటిని తలదన్నేలా తుది తీర్పు వచ్చింది.. హర్యానాలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని విధంగా పుంజుకుంది.. వ్యతిరేకత జస్ట్ మాటల వరకే పరిమితం అని.. ప్రజా తీర్పు బీజేపీ వైపే అనేలా తీర్పు వచ్చిందంటూ పేర్కొంటున్నారు కషాయపార్టీ నేతలు.. తాజా ట్రెండ్స్ ప్ర‌కారం బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.. బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాల్లో ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. నిరుద్యోగం, రైతు ఉద్యమం.. ఇలా హర్యానా బీజేపీ సర్కార్ పై చాలా వ్యతిరేకత ఉన్నా.. అక్కడ నరేంద్ర మోదీ వ్యూహం ప్రధానంగా పనిచేసింది. పార్లమెంట్ ఎన్నికలైనా.. అసెంబ్లీ ఎన్నికలైనా మోదీనే బీజేపీ అస్త్రంగా పనిచేసింది..

ఇప్పటికే కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. డబుల్ ఇంజన్ సర్కార్ సూత్రంతో హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ప్రచారం చేసింది.. లోక్ సభ ఎన్నికల తర్వాత హర్యానా, జమ్ముకశ్మీర్ జరిగిన ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రంగంలోకి దిగి అన్ని తానై ప్రచారాన్ని నిర్వహించారు.. హర్యానాలో ఇప్పటికే పదేళ్లు అధికారంలోకి ఉన్న బీజేపీ పలు విషయాల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది.. అయినప్పటికీ.. ప్రధాని మోదీ.. బీజేపీ సర్కార్ అభివృద్ధి.. గురించి వివరిస్తూ గెలుపే మంత్రంగా పలు వ్యూహాలతో ముందుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కంటే.. బీజేపీ విధానాలు బలమైనవని.. అభివృద్ధి మంత్రంలో తమకెవ్వరూ సాటిలేరంటూ చెప్పారు.. ప్రధానంగా మోదీ వ్యూహాలు కాంగ్రెస్ ను చెక్ పెట్టేలా చేశాయంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు.

మోదీ ఆర్కైవ్ ట్వీట్..

హర్యానా ఫలితాలు వెలువడతున్న క్రమంలో.. మోదీ ఆర్కైవ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ ను పంచుకున్నారు. బీజేపీ పునాది నుంచి బలమైన మద్దతు దిశగా ఓ స్థావరాన్ని నిర్మించడానికి నరేంద్ర మోడీ తన జీవితమంతా అంకితం చేశారు. ఆయన జీవితకాల అంకితభావం.. ఈ ఫలితం.. ఎన్నికల తర్వాత.. ఎన్నికల్లో అతను చేసిన కృషి.. బిజెపి అందుకున్న చారిత్రాత్మక విజయాలో ఇది ప్రతిబింబిస్తుంది.. అంటూ హర్యానాలో కొన్ని దశాబ్దాల క్రితం పర్యటించిన ఫొటోను ఆర్కైవ్ లో పంచుకున్నారు. బీజేపీ మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఈ ఫోటోను షేర్ చేయడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?