My India My Life Goals: నువ్వు గ్రేట్ బాసూ.. కరోనాతో పోరాడేందుకు ఆక్సిజన్ వనాలు..
Lifestyle For Environment -Inspirational Story: ప్రస్తుత కాలంలో అన్ని కలుషితమవుతున్నాయి. దీంతో పలు రోగాలు మనుషుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని..
Lifestyle For Environment -Inspirational Story: ప్రస్తుత కాలంలో అన్ని కలుషితమవుతున్నాయి. దీంతో పలు రోగాలు మనుషుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మానవ మనుగడ సాధ్యమని.. లేకుంటే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవంటూ పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి అమ్మలాంటిదని.. దానిని జాగ్రత్తగా చూసుకోవాలంటూ పేర్కొంటున్నారు. ఇప్పటికే.. కరోనావైరల్ లాంటి మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. కోవిడ్-19 మహమ్మారి బారిన కోట్లాది మంది పడ్డారు.. లక్షలాది మంది ఈ వైరస్ తో మరణించారు.. ఈ కరోనా సమయంలో వైద్య రంగంలో ఎన్నో సవాళ్లు తెరపైకి వచ్చాయి. డ్రగ్స్ కొరత, సౌకర్యాల లేమి, వ్యాక్సిన్ కనిపెట్టడం, ఆక్సిజన్ లేకపోవడం ఇలా ఎన్నో విపత్కర పరిస్థితులను మనం కళ్లారా చూశాం.. అయితే, ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నా.. చాలా మంది ఆక్సిజన్ కొరతతో మరణించారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతను చూసి.. హర్యానా ట్రీమ్యాన్ దేవేందర్ సుర ఆక్సిజన్ వనాలను ఏర్పాటు చేశారు.
ఆ ఆక్సిజన్ వనాలు ఇప్పుడు కొన్ని వేల పక్షిజాతులకు ఆవాసంగా నిలవడంతోపాటు.. ఒక ప్రజా ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ సందర్భంగా ట్రీమ్యాన్ దేవేందర్ సుర మాట్లాడుతూ.. 2020లో వచ్చిన కరోనాతో ఆక్సిజన్ అవసరాన్ని గుర్తించామని.. దీంతో గ్రామాలలో ఆక్సిజన్ వనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాము నాటిన వృక్షాలు ఇప్పుడు కొన్ని వేల పక్షిజాతులకు ఆవాసంగా నిలుస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఇది ఒక ప్రజా ఉద్యమంగా రూపుదాల్చినట్లు దేవేందర్ వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..