AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: దేశ రాజకీయాల్లో మార్పులకు మహారాష్ట్ర నుంచే శ్రీకారం: కేసీఆర్

BRS: దేశ రాజకీయాల్లో మార్పులకు మహారాష్ట్ర నుంచే శ్రీకారం చుడతామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన... తెలంగాణ కిసాన్‌ మోడల్‌ను దేశమంతా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

CM KCR: దేశ రాజకీయాల్లో మార్పులకు మహారాష్ట్ర నుంచే శ్రీకారం: కేసీఆర్
Telangana CM KCR
Ram Naramaneni
|

Updated on: Jun 15, 2023 | 7:16 PM

Share

మహారాష్ట్ర, నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవం.. అట్టహాసంగా జరిగింది. గాందీబాగ్‌లో ఏర్పాటుచేసిన పార్టీ ఆఫీసులో.. పార్టీ నేతలతో కలిసి గులాబీ జెండా ఆవిష్కరించారు కేసీఆర్‌. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్‌… మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ తుపాన్‌లా దూసుకెళ్తోందన్నారు. ఇప్పటికే లక్షల మంది తమ కమిటీల్లో చేరారని చెప్పారు. ఎవరికి పడితే వారికి కాదు… రైతులకు, యువతకు అవకాశమిస్తామని చెప్పారు కేసీఆర్‌.

బీజేపీ టార్గెట్‌గా పరోక్ష విమర్శలు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ధర్మం పేరిట, జాతీయవాదం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. దేశంలో మార్పునకు మహారాష్ట్ర నుంచే నాంది పలుకుతామన్నారు కేసీఆర్‌. దేశంలోని సామాన్య ప్రజల దగ్గర ఆలోచనా బాంఢాగారం ఉందనీ… ఎమర్జెన్సీ సమయంలో వారి తీర్పును స్పష్టంగా చూశామని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ.. అదనుకోసం జనం ఎదురుచూస్తున్నారని చెప్పారు కేసీఆర్‌.

దేశంలో పరివర్తన కోసం.. బీఆర్‌ఎస్‌ ఒక మిషన్‌లా పనిచేస్తుందన్న కేసీఆర్‌.. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనేది కేవలం నినాదం కాదనీ, అది నిర్ధారణ అని స్పష్టం చేశారు. ముంబై, నాందేడ్‌ సహా కీలక నగరాల్లో పార్టీ ఆఫీసులు ప్రారంభించుకుని.. మరింత క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
తమ్ముడి సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేసిన చిరు..
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
ఈ తెలుగు నటికి ఫ్లాట్‌లు కొని ఇచ్చిన ధీరుభాయ్ అంబానీ
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
వాట్సాప్‌లో ఒక్క మెసేజ్‌ చేస్తే నిమిషాల్లోనే ఆధార్‌ డౌన్‌లోడ్
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..
పెద్ద రోల్ అని చెప్పి ఎడిటింగ్‌లో లేపేశారు..