AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajya Sabha: ఎంపీల సస్పెన్షన్‌‌పై కొనసాగుతున్న రచ్చ.. క్షమాప‌ణ‌లు చెప్పకుండా స‌స్పెన్షన్ ఎత్తివేయ‌లేంః వెంకయ్య నాయుడు

పార్లమెంట్ శీతాకాల స‌మావేశాల మొద‌టి రోజే రాజ్యసభలో 12 మంది విప‌క్ష పార్టీల స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేయ‌డంపై అధికార‌, ప్రతిప‌క్ష పార్టీల మ‌ధ్య రచ్చ కొన‌సాగుతున్నాయి.

Rajya Sabha: ఎంపీల సస్పెన్షన్‌‌పై కొనసాగుతున్న రచ్చ.. క్షమాప‌ణ‌లు చెప్పకుండా స‌స్పెన్షన్ ఎత్తివేయ‌లేంః వెంకయ్య నాయుడు
Venkaiah Naidu
Balaraju Goud
|

Updated on: Nov 30, 2021 | 2:04 PM

Share

Rajya Sabha Chairman Venkaiah Naidu: పార్లమెంట్ శీతాకాల స‌మావేశాల మొద‌టి రోజే రాజ్యసభలో 12 మంది విప‌క్ష పార్టీల స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేయ‌డంపై అధికార‌, ప్రతిప‌క్ష పార్టీల మ‌ధ్య రచ్చ కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం విప‌క్ష పార్టీల‌కు చెందిన 8 మంది రాజ్యస‌భ స‌భ్యులు.. కాంగ్రెస్ రాజ్యస‌భాప‌క్ష నేత మల్లిఖార్జున ఖ‌ర్గే నేతృత్వంలో ఛైర్మన్ వెంక‌య్యనాయుడును కలుసుకుంది. విప‌క్షాలకు చెందిన 12 మంది ఎంపీల‌పై విధించిన స‌స్పెన్షన్‌ను ఎత్తివేయాలని రాజ్యసభ ఛైర్మన్ వెంక‌య్యనాయుడును కోరారు. అయితే, స‌స్పెండ్ అయిన స‌భ్యులు క్షమాప‌ణ‌లు చెప్పకుండా వారిపై స‌స్పెన్షన్ ఎత్తివేయ‌డం సాధ్యం కాద‌ని వెంక‌య్యనాయుడు తేల్చి చెప్పారు.

ప్రశ్చాత్తాపం వ్యక్తం చేయనందున రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేసేదీ లేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారమే ఎంపీలపై చర్యలు తీసుకున్నామని, 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయబోమని అన్నారు. ఎంపీల సస్పెన్షన్ ను రద్దు చేయాలని ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని తాను పరిగణనలోకి తీసుకోవడం లేదని నాయుడు అన్నారు. దీనిపై రాజ్యసభ ఛైర్మన్ కు ఎంపీలపై చర్య తీసుకునే అధికారం ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. గత వర్షాకాల సమావేశాల చేదు అనుభవం మనలో చాలా మందిని వెంటాడుతూనే ఉందని వెంకయ్య చెప్పారు. ఇదిలావుంటే, తాము ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, స‌భ‌లో క్షమాప‌ణ‌లు చెప్పే ప్రస‌క్తే లేద‌ని స‌స్పెండైన ఎంపీలు తెగేసి చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపీలను సస్పెండ్ చేశారని‌ మల్లికార్జున్‌ ఖర్గే ఆరోపించారు.

మరోవైపు, ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికమని కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి అనుకూలంగా రాజ్యసభలో ఓటింగ్ సంఖ్యను పెంచుకునేందుకు సస్పెండ్ చేశారని ఆయన ధ్వజమెత్తారు. ‘‘రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా బీజేపీ మెజారిటీ కంటే ముందుంది.. ఇప్పుడు ఎగువ సభ ద్వారా జాబితా చేసిన బిల్లులను సులభంగా ఆమోదించగలదు’’ అని అభిషేక్ ట్వీట్ చేశారు.

కాగా సమావేశాల చివరి రోజైన ఆగస్టు 11 నాటి సంఘటనలకు సంబంధించి అసభ్యంగా ప్రవర్తించినందుకు ప్రభుత్వం 12మంది ఎంపీలను సస్పెండ్ చేయాల్సి వచ్చిందని, అయితే వారు క్షమాపణ చెబితే సస్పెన్షన్‌ను ఉపసంహరించుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు..

Read Also…  Bandi Sanjay: కేసీఆర్ జాగ్రత్తగా మాట్లాడాలి.. బండి సంజయ్ ప్రెస్ మీట్