PM Narendra Modi: మాజీ ప్రధాని దేవగౌడతో నరేంద్రమోడీ భేటీ .. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్..

Narendra Modi Met HD Devegowda: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడూ హుందాగా ఉంటారు. ఖాళీ సమయంలో.. లేకపోతే వీలైనప్పుడు పలువురు కీలక నేతలను, మేథావులను,

PM Narendra Modi: మాజీ ప్రధాని దేవగౌడతో నరేంద్రమోడీ భేటీ .. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్..
Narendra Modi Met Hd Devego
Follow us

|

Updated on: Nov 30, 2021 | 2:06 PM

Narendra Modi Met HD Devegowda: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడూ హుందాగా ఉంటారు. ఖాళీ సమయంలో.. లేకపోతే వీలైనప్పుడు పలువురు కీలక నేతలను, మేథావులను, ప్రత్యేకమైన వ్యక్తులను కలిసి సంభాషిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రధాని మోడీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల్లో ఫొటోలను షేర్ చేసి తన అనుభవాలను పంచుకుంటుంటారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోదీ.. తాజాగా మాజీ ప్రధానమంత్రి దేవగౌడతో భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాలకు హాజరైన హెచ్‌డీ దేవగౌడను ప్రధాని మోదీ సాదరంగా ఆహ్వానించి.. ఆయనతో ముచ్చటించారు. దేవగౌడతో మంగళవారం భేటీ అయిన ఫొటోలను ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, దేవగౌడ పలు కీలక విషయాలపై చర్చించినట్లు సమాచారం. కర్ణాటకలో కీలకంగా వ్యవహరిస్తున్న జనతాదళ్ సెక్యులర్ పార్టీ అధినేతతో ప్రధాని మోడీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

వ్యవసాయ బిల్లులు, క్రిప్టో కరెన్సీ తదితర అంశాలపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ దేవగౌడతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. తాజా, మాజీ ప్రధాని భేటీపై నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. 2023లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అదేవిధంగా జేడీఎస్ పార్టీల పొత్తు ఉంటుందేమోనన్న సందేహాలను వ్యక్తంచేస్తున్నారు. అంతకుముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దేవగౌడ కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి సీఎంగా బాధ్యతలు సైతం చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు, కొంతమంది బీజేపీలో చేరడంతో.. కుమారస్వామి రాజీనామా చేశారు. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని చేపట్టింది.

Also Read:

Rajya Sabha: ఎంపీల సస్పెన్షన్‌‌పై కొనసాగుతున్న రచ్చ.. క్షమాప‌ణ‌లు చెప్పకుండా స‌స్పెన్షన్ ఎత్తివేయ‌లేంః వెంకయ్య నాయుడు

Watch Video: డెంజరస్ యాక్సిడెంట్.. మద్యం మత్తులో దూసుకొచ్చి చంపారు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో