Live-in Relationship:పెళ్లి వద్దు.. సహజీవనం ముద్దు.. పిల్లతో పాటు పెళ్లి చేసుకునే తల్లిదండ్రులు.. మనదేశంలోఎక్కడంటే
Live-in Relationship: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచం ఇష్టపడుతుంది. ముఖ్యంగా భారత దేశంలోని వివాహ వ్యవస్థకు.. పెళ్లిళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. యువతి మెడలో...
Live-in Relationship: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచం ఇష్టపడుతుంది. ముఖ్యంగా భారత దేశంలోని వివాహ వ్యవస్థకు.. పెళ్లిళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. యువతి మెడలో యువకుడు తాళి కట్టిన తర్వాత కొత్త జీవితం మొదలవుతుంది. మెట్రో సిటీల్లో సహజీవనం సాగించే జంటలున్నా నూటికో కోటికో ఒకటి కనిపిస్తుంది. అయితే మనదేశంలోనే పెళ్లి తంతు ముగిసిన తర్వాతే సంసారం, పిల్లలు అనే సంస్కృతీ, సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. పాశ్చాత్య సంస్కృతిని తలపించే విధంగా ఓ ప్రాంతంలో పెళ్లి తంతు సహజీవనంతోనే మొదలవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత బుద్ధిపుడితే పెళ్లి చేసుకుంటారు. లేదంటే వాళ్ల బిడ్డలు పెరిగిపెద్దయ్యాక తల్లిదండ్రులకు వివాహం చేస్తారు. ఈ ప్రేమలు సహజీవనం పెళ్లిళ్లు తంతు రాజస్థాన్‌లో జరుగుతుంది.
భారతీయ ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో సాధారణంగా పెళ్లికి ముందు పెద్దలు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. యువతీ యువకులకు నచ్చితే కట్నకానుకల గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత నిశ్చితార్థం ఏర్పాటు చేస్తారు. కొన్ని రోజుల తర్వాత పెళ్లికి ముహూర్తం పెడతారు. ఇదంతా లాంగ్ ప్రాసెస్. కానీ గరాసియా తెగలో ఇలాంటివేమీ కనిపించవు. ఈ ఆదివాసీ తెగలో నచ్చిన యువతీ యువకులు ముందుగా సహజీవనం చేస్తారు. సంతానం కలిగిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, పాలి జిల్లాల్లో ఈ తెగ ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ గరాసియా తెగ ఉంది.
ఈ గరాసియా తెగ ఆచారమే వేరు. గ్రామల్లో రెండు రోజులపాటు జరిగే జాతరలే వాళ్లకు పెళ్లి చూపుల వేదిక. జాతరలో కలుసుకునే యువతీ యువకులు తమకు నచ్చిన వాళ్లను ఎంచుకునే స్వేచ్ఛ వాళ్లకుంది. ఒకరినొకరు ఇష్టపడితే లేచిపోతారు. తిరిగొచ్చి ఆ విషయం పెద్దలకు చెప్పి సహజీవనం మొదలు పెడతారు. పిల్లలు పుట్టిన తర్వాత .. తమకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటారు. లేదంటే కొందరు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం సహజీవనం కొనసాగిస్తారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే పిల్లలు పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత తల్లిదండ్రులకు పెళ్లిళ్లు చేస్తారు. కొంతమంది పిల్లలు, తల్లిదండ్రుల వివాహం ఒకేసారి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటికే తల్లిదండ్రుల వయసు యాబై నుంచి అరవై ఏళ్లకు చేరుతుంది. అంటే షష్టిపూర్తి చేసుకునే వయసులో పెళ్లవుతుందన్నమాట. నయినా గరాసియా 70 ఏళ్ల వయసులో తన లివ్ ఇన్ పార్టనర్ కాళీతో పెళ్లి చేసుకోవడమే అందుకు ఉదాహరణ. అప్పటికే వీళ్లకు ముగ్గురు పిల్లలు. విచిత్రం ఏంటంటే… ఈ ముగ్గురూ తల్లిదండ్రులతోపాటు ఒకే రోజు వివాహం చేసుకున్నారు.
ఒకవేళ సంతానం కలగకపోతే యువతీ యువకులు విడిపోతారు. మళ్లీ స్వయంవరం మొదలవుతుంది. నచ్చినవాళ్లతో రెండోసారి సహజీవనం సాగిస్తారు. ఇక పిల్లలు పుట్టిన తర్వాత విడిపోవాలనుకుంటే… విడిపోయి వేర్వేరుగా నివసిస్తారు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో కనిపించే సంస్కృతి గరాసియా తెగలో కనిపిస్తుంది. అయితే ఇదేమీ కొత్తగా మొదలైన సంప్రదయం కాదు.. గత వెయ్యేళ్ల నుంచి వస్తున్న ఆచారం అంటారు ఈ తెగ ఆదివాసీలు. ఈ లివింగ్ టుగెదర్ రిలేషన్‌షిప్‌లో వరుడి కుటుంబసభ్యులు వధువు కుటుంబానికి కన్యాశుల్కం చెల్లించడం ఆనవాయితీ. అంతేకాదు పెళ్లి ఖర్చులు కూడా వరుడి కుటుంబమే భరించాలి. మన దేశంలో గరాసియా ఆదివాసీ తెగ జనాభా 3 లక్షల 60 వేలు మాత్రమే. అయితే ఈ తెగ వినూత్న ఆచారం వల్ల వరకట్న వేధింపులు, అత్యాచారాలు, గృహహింసలు వంటి ఏమీ ఈ తెగలో కనిపించవు.. ఇదే గరాసియా తెగ ప్రత్యేకత.
Also Read: అమెరికాలో కిస్సింగ్ డే ఈరోజు.. ఎందుకు పండుగలా జరుపుకుంటారంటే..
రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..! ఇక నుంచి డీలర్లు తూకంలో మోసం చేయలేరు..?
పండ్ల వ్యాపారి మోసం.. కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాడో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!