మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ రానాకు సుప్రీంకోర్టు ఊరట… బాంబే హైకోర్టు ఉత్తర్వుల నిలిపివేత…
తన ఎస్సీ సర్టిఫికెట్ వ్యవహారంలో మహారాష్ట్ర..అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానాకి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది.
తన ఎస్సీ సర్టిఫికెట్ వ్యవహారంలో మహారాష్ట్ర..అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రానాకి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి ఆమె ఈ ఎస్సీ సర్టిఫికెట్ ను సంపాదించిందని, అందువల్ల దీన్ని రద్దు చేస్తున్నామని బాంబేహైకోర్టులోగడ ఉత్తర్వులు జారీ చేయగా వాటిని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టుకెక్కింది. బాంబేహైకోర్టు ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం సమర్థించి ఉంటే ఈమె తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయి ఉండేది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన అమరావతి నియోజకవర్గం నుంచి నవనీత్ కౌర్ రానా ఎన్సీపీ మద్దతుతో పోటీ చేసి గెలిచింది. అయితే ఈమె ఎస్సీ సర్టిఫికెట్ పై ఒకరు బాంబేహైకోర్టుకెక్కారు. ఆ పిల్ పై విచారించిన కోర్టు ఆ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడమే గాక.. రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది. రెండు వారాల్లోగా ఈ జరిమానాను ఆమె మహారాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాల్సి ఉంది. కాగా-ఎస్సీ సర్టిఫికెట్ పొందడానికి నవనీత్ కౌర్…,తనను ‘మోచీ’ (చెప్పులు కుట్టే వారి) కులానికి చెందినదిగా చెప్పుకుందని ఇది మోసపూరితమని బాంబేహైకోర్టు పేర్కొంది. పైగా ఈ వాదనను అంగీకరించిన స్క్రూటినీ కమిటీని కూడా కోర్టు తప్పు పట్టింది.
2013 లో నవనీత్ కౌర్ రానాకు ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని, అది రద్దు చేయాలనీ కోరుతూ ఆనంద్ రావ్ అడ్ సులే అనే సోషల్ వర్కర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త, ఎమ్మెల్యే అయిన రవి రానా పలుకుబడితో ఆమె ఈమె ఈ సర్టిఫికెట్ పొందిందని ఆ పిటిషనర్ ఆరోపించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: రష్యన్ నేషనల్ పార్కులో దారుణం…16 ఏళ్ళ బాలుడిపై ఎలుగుబంటి దాడి… కాల్చి చంపిన రేంజర్లు