పారికర్ తనయుడికి కరోనా.. ఆసుపత్రిలో చేరిన బీజేపీ నేత

గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు, బీజేపీ నేత ఉత్పల్‌ పారికర్‌కి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 5:39 pm, Sun, 16 August 20
పారికర్ తనయుడికి కరోనా.. ఆసుపత్రిలో చేరిన బీజేపీ నేత

Manohar parrikar son: గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనయుడు, బీజేపీ నేత ఉత్పల్‌ పారికర్‌కి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై శనివారం మాట్లాడిన ఆయన.. ”నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పెద్దగా లక్షణాలేవీ లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో ఉంటానని చెప్పాను” అని అన్నారు. అయితే ఆదివారం సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ” వైద్యుల సలహా మేరకు ఇప్పుడు ఆసుపత్రిలో చేరాను. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ఉత్పల్ కామెంట్ పెట్టారు. కాగా గోవాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య  11,339కు చేరింది. అందులో 7,488 మంది కరోనా నుంచి కోలుకోగా.. మరణాల సంఖ్య 98కి చేరింది.

Read More:

నాని ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రెడీ అవుతోన్న ‘వి’ ట్రైలర్‌‌!

ఇక్కడ మహేంద్ర సింగ్‌ ధోని.. సుశాంత్‌తో సోదరీమణుల వీడియో వైరల్‌