ఐదు రూపాయల డాక్టర్ మృతి.. సీఎం సంతాపం
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన 'మెర్సల్' చిత్రంలోని ఐదు రూపాయల డాక్టర్ అనే పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ ఐదు రూపాయల డాక్టర్ ఇక లేరు. కేవలం రూ.5లకే వైద్యం అందించి, నిరు పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిన చెన్నై వ్యాసరపాడికి చెందిన డాక్టర్ తిరివెంగదమ్ వీర రాఘవన్..
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రంలోని ఐదు రూపాయల డాక్టర్ అనే పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ ఐదు రూపాయల డాక్టర్ ఇక లేరు. కేవలం రూ.5లకే వైద్యం అందించి, నిరు పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిన చెన్నై వ్యాసరపాడికి చెందిన డాక్టర్ తిరివెంగదమ్ వీర రాఘవన్ కన్ను మూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందులూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
1973లో వ్యాసరపాడి అశోక స్తంభానికి సమీపంలోని ఎరుక్కంచెరి ప్రాంతంలో క్లీనిక్ స్థాపించారు వీర రాఘవన్. అప్పటి నుంచి నిరుపేదలకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్నారు. తొలుత కేవలం రూ.2 ఫీజుతో వైద్య సేవలు అందించేవారు. ప్రతి రోజూ ఆయన క్లీనిక్ రోగులతో కిటకిటలాడేది. ఆ తర్వాత తన వద్దకు వచ్చే వారి ఒత్తిడితో ఫీజును రూ.5కు పెంచారు. అదే ఫీజుతో చివరి క్షణాల వరకు సేవలందించారు.
వీర రాఘవన్ జీవితం ఆధారంగా తమిళ స్టార్ హీరో విజయ్.. ఐదు రూపాయల డాక్టర్‌గా నటించిన చిత్రంతో ఆయన సేవలు వెలుగులోకి వచ్చాయి. ఇక 2015లో వచ్చిన వరదల కారణంగా వీర రాఘవన్ క్లీనిక్ పూర్తిగా ధ్వంసం అయింది. అక్కడి నుంచి సమీపంలోని మరో ప్రాంతంలో క్లీనిక్ ఏర్పాటు చేసినప్పటికీ తన ఫీజును మాత్రం ఐదు రూపాయలుగానే కొనసాగించారు.
వీర రాఘవన్ భార్య పిల్లు కూడా వైద్యులుగానే స్థిరపడ్డారు. ఇక ఆయన మృతి పట్ల ఆయన కుటుంబానికి తమిళనాడు సీఎం పళని స్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ సంతాపం ప్రకటించారు.
Read More: