వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్

తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయ‌ని అధికారులు సూచించారు. ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం క్ర‌మ క్ర‌మంగా..

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 2:03 PM

తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు. భారీ వ‌ర్షాల కార‌ణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయ‌ని అధికారులు సూచించారు. ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం క్ర‌మ క్ర‌మంగా బలహీనపడుతుంది. అలాగే 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూండ‌టంతో.. రాబోయే 48 గంటల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు ప‌డే అవ‌కాశాలున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ రోజు కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కొమురం భీం, నిజామాబాద్ ,నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, మంచిర్యాల,పెద్దపల్లి మేడ్చల్, మల్కాజిగిరి, వరంగల్ రూరల్, అర్బన్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు ప‌డ‌నున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఛాన్స్ ఉంద‌ని, ట్రాన్స్‌పోర్టులో ఇబ్బంది కలిగే అవకాశాలు ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వెద‌ర్ డిపార్ట్‌మెంట్ అధికారులు సూచించారు.

Read More: 

ఏపీః మండ‌పేట ఎమ్మెల్యేకి క‌రోనా పాజిటివ్‌