భాగ్యనగరంలో రంజాన్ శోభ.. ఇకపై 24 గంటలు షాపులు
ఓపెన్
TV9 Telugu
10 March 2024
రంజాన్ మాసంలో హైదరాబాద్ లో మార్కెట్లను 24 గంటలు నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
దుకాణాలు.. ఇతర సంస్థలు రాత్రిపూట తెరిచేందుకు కార్మిక శాఖ అనుమతి ఇస్తుందని అధికార వర్గాలు వెల్లడిస్
తున్నాయి.
ఓనర్స్.. హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కార్మిక శాఖకు ఇప్పటికే వినతిపత్రం సమర్పించారు.
త్వరలోనే అనుమతులు జారీ అవుతాయని, పవిత్ర మాసంలో ఈ సంస్థలు తెరిచే ఉంటాయని ప్రభుత్వ అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
అయితే లోక్ సభ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే కోడ్ అమలులోకి వస్తే హైదరాబాద్ లోని 24 గంటల మార్కెట్లకు కొన్ని షరతులు విధించే అవకాశం ఉంది.
రంజాన్ సందర్భంగా.. అదనపు గంటలు పనిచేసినందుకు యాజమాన్యం ఉద్యోగులకు ఓవర్ టైమ్ పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.
రంజాన్ పర్వదినం మైనార్టీలకు ముఖ్యమైన పర్వదినం.. ఈ సమయంలో రోజంతా ఉపవాసం ఉంటూ కఠిన అలవాట్లను పాటిస్తుంటారు.
రంజాన్ అంటే హలీం.. హాలీం అంటనే రంజాన్.. హైదరాబాద్ లో ఎక్కడా చూసినా హలీం ఘుమఘమలు నోరూరిస్తుంటాయి. రాత్రివే
ళలో చాలామంది హలీం తింటారు.
ఇక్కడ క్లిక్ చేయండి