Bhimaa: OTTలోకి వచ్చేసిన గోపీచంద్ యాక్షన్ సినిమా భీమా.!

Bhimaa: OTTలోకి వచ్చేసిన గోపీచంద్ యాక్షన్ సినిమా భీమా.!

Anil kumar poka

|

Updated on: Apr 26, 2024 | 1:10 PM

మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా భీమా.! ఏ. హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించగా.. నరేష్, వెన్నెల కిశోర్, పూర్ణ, రఘుబాబు, నాజర్ కీలకపాత్రలో పోషించారు. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇందులో గోపిచంద్ భీమా, రామా అనే రెండు పాత్రలు పోషించారు.

మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా భీమా.! ఏ. హర్ష దర్శకత్వం వహించిన ఈ మూవీలో మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించగా.. నరేష్, వెన్నెల కిశోర్, పూర్ణ, రఘుబాబు, నాజర్ కీలకపాత్రలో పోషించారు. ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. ఇందులో గోపిచంద్ భీమా, రామా అనే రెండు పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ తో క్యూరియాసిటి కలిగించిన ఈ మూవీ మార్చి 8న అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీలో ఈ మూవీ ఎప్పుడొస్తుందా అనే వెయిటింగ్ ఉంది. ఇక ఈ క్రమంలోనే ఈఇప్పుడు ఈమూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

భీమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 24 అర్థరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. భీమా సినిమా ఓటీటీ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు గోపిచంద్. ఏప్రిల్ 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తన సినిమా స్ట్రీమింగ్ అవుతుందని.. చూడండి అంటూ ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోను పంచుకున్నాడు గోపీచంద్. ఇక గోపీచందస్‌ భీమా సినిమా థియేటర్లలో దాదాపు 20కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్స్ రాట్టింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధమోహన్ 25 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!