డ్యాన్స్ చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామన్నారు: పోలీసుపై టీనేజర్ ఆరోపణలు

ఎఫ్‌ఐఆర్‌ని నమోదు చేయమని కోరితే పోలీసులు తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఓ మైనర్ బాలిక ఆరోపణలు చేశారు.

డ్యాన్స్ చేస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామన్నారు: పోలీసుపై టీనేజర్ ఆరోపణలు
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 6:13 PM

Cop Asks 16-year-old Girl to Dance: ఎఫ్‌ఐఆర్‌ని నమోదు చేయమని కోరితే పోలీసులు తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని ఓ మైనర్ బాలిక ఆరోపణలు చేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు  చేయాలంటే తమ ముందు డ్యాన్స్ చేయాలని పోలీసులు అన్నారని ఆ టీనేజర్‌ తెలిపారు. అంతేకాదు సమయం కాని సమయంలో స్టేషన్‌కి రమ్మన్నరాని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే గోవింద్‌ నగర్‌లోని దాబౌలి పశ్చిమ ప్రాంతంలో ఓ కుటుంబం అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే వారు నివసిస్తోన్న ఇంటి స్థలం యజమాని మేనల్లుడు అనురాగ్ మిశ్ర వారి కుమార్తెను గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. అంతేకాదు ఆ కుటుంబంపై దాడి చేయడంతో పాటు వారిని అక్కడి నుంచి గెంటివేయించాడు. ఇక ఈ నెల 7న తన పనిని ముగించుకొని వస్తోన్న టీజేజర్‌పై మరోసారి అనురాగ్‌ లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె సమీప పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి, అతడిపై ఫిర్యాదు చేసింది. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటే తమ ముందు డ్యాన్స్ చేయాలని ఆ పోలీసులు కోరినట్లు బాధితురాలి తల్లి వాపోయింది. దీనిపై గోవింద్ నగర్ సర్కిల్ ఆఫీసర్ వికాస్ కుమార్‌ పాండే మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అన్నారు.

Read More:

సుశాంత్‌ మరణం తరువాత భయమేసింది: నటుడు అంగద్‌

పారికర్ తనయుడికి కరోనా.. ఆసుపత్రిలో చేరిన బీజేపీ నేత