పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు 10 స్క్రీన్లు !

ఈ కరోనా సీజన్ లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎలా నిర్వహించాలన్న అంశంపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. లోక్ సభ రోజుకు నాలుగు గంటలు, ఆ తరువాత రాజ్యసభ 4 గంటలు సమావేశం..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు 10 స్క్రీన్లు !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2020 | 5:17 PM

ఈ కరోనా సీజన్ లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎలా నిర్వహించాలన్న అంశంపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. లోక్ సభ రోజుకు నాలుగు గంటలు, ఆ తరువాత రాజ్యసభ 4 గంటలు సమావేశం కావాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 85 అంగుళాల నాలుగు పెద్ద స్క్రీన్లను, 40 అంగుళాల ఆరు చిన్న స్క్రీన్లను, నాలుగు గ్యాలరీలలో కన్సోల్స్ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చర్చలు, డిబేట్లలో సభ్యులు పాల్గొనేందుకు ఆడియో విజువల్ సిగ్నల్స్, కమ్యూనికేషన్ కన్సోల్స్ కూడా ఉంటాయి. బ్యాక్టీరియా, ఇతర వైరస్ లను నశింప జేయడానికి రాజ్యసభ ఎయిర్ కండీషనింగ్ యూనిట్ లో ఆల్ట్రావయొలెట్ ‘ఇర్రేడియేషన్’ సిస్టం కూడా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సభ్యుల మధ్య భౌతిక దూరం మామూలే ! ఉభయ సభల చాంబర్స్ నుంచి  అధికారుల గ్యాలరీని వేరు చేసేందుకు పాలీ కార్బోనేట్ షీట్లను వినియోగించనున్నారు. సీటింగ్ ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక జర్నలిస్టులు, మాజీ ఎంపీలను అస్సలు అనుమతించబోరు.  అయితే పార్లమెంట్ ఎప్పుడు సమావేశమయ్యేదీ ఇంకా నిర్ధారించలేదు. కోవిడ్ పరిస్థితి కొంత అదుపులోకి వచ్చిన తరువాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవచ్చు.